ప్రగతిశీల మహిళా సంఘం నాయకురాలు షేక్. మెహమాద
చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారంటీ హామీలను వెంటనే నెరవేర్చాలి.
పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న, మద్యం, బెల్టు, షాపులను నివారించి.వాటిని నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోనీ ముఖ్యమంత్రి ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి.
మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు నెలకు 25 వందల రూపాయల సహకారం అందించాలి.
500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలి.
సరిపడా బస్సులు లేక ఉచిత బస్సు ప్రయాణాలు చేస్తున్న మహిళలు పడుతున్న ఇబ్బందులను దృష్టిలో ఉంచుకొని ఆర్టీసీ బస్సులను సరిపడ పెంచాలి.
4000 రూపాయల పింఛన్ ఇవ్వాలి.
యువతులకు స్కూటీలు ఇవ్వాలి.
కొత్తగా పెళ్లయిన ఆడబిడ్డలకు తులం బంగారం ఇవ్వాలి.
చర్ల ఆసుపత్రిలో సరిపడా వైద్య సిబ్బందిని నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలి.
చర్ల మండల కేంద్రంలోని ఆయిల్ బంక్ ఏరియాలో ప్రగతిశీల మహిళా సంఘం (POW) ముఖ్య కార్యకర్తల సమావేశం గురువారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా ప్రగతిశీల మహిళా సంఘం చర్ల మండలం నాయకురాలు షేక్ మెహమద మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం మహిళలకు ఇచ్చిన గ్యారెంటీలను తక్షణమే అమలు చేయాలని అన్నారు. గౌరవ ముఖ్యమంత్రి బెల్ట్ షాపులను బందు జేపిస్తామని హామీ ఇచ్చారు కానీ ఇప్పటివరకు ఎక్కడా కూడా ఈ పని అమలు జరగలేదని అన్నారు. చర్ల మండలంలో గుడి బడి గ్రామం అనే ప్రాంతాల భేదం లేకుండా పుట్టగొడుగుల్లా దాదాపుగా గ్రామానికి మూడు బెల్ట్ షాపులు ఉన్నాయని మొత్తం మీద 300కు పైగా బెల్ట్ షాప్ లో ఉంటాయని దీని కారణంగా కుటుంబాలు ఆర్థిక నష్టానికి కలహాలకు గురవుతున్నారని కుటుంబాలు చిందరవందర గందరగోళం అవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన హామీ మేరకు బెల్ట్ షాపులు నియంత్రించాలని వాటిని నడుపుతున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని అన్నారు. ప్రతి మహిళకు 2500 రూపాయల ఆర్థిక సహకారం ప్రతినెల అందించాలని అన్నారు. 500 రూపాయలకే గ్యాస్ సిలిండర్ ఇవ్వాలని అన్నారు. ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం మహిళల కల్పించడం సంతోషకరమని కానీ సరిపడా బస్సులు లేక ఉచిత ప్రయాణం చేసే మహిళలు తిట్టుకోవడం కొట్లాడుకోవడం వంటి పనులు చేస్తున్నారని అందుకు కారణం సరిపడా బస్సులు లేకపోవడం అని తక్షణమే సరిపడా ఆర్టీసీ బస్సులను నియమించాలని అన్నారు. 4000 రూపాయల పింఛను ఇవ్వాలని అన్నారు.
యువతలకు స్కూటీలు ఇస్తానని హామీ ఇచ్చారని ఆ హామీలు నిలబెట్టుకోవాలని అన్నారు. కొత్తగా పెళ్లయిన వారికి తులం బంగారం ఇస్తానన్నారని దాని వెంటనే అమలు చేయాలని అన్నారు.చర్ల ప్రభుత్వ ఆసుపత్రిలో సరిపడ వైద్య సిబ్బంది లేరని సరిపడా సిబ్బందిని నియమించి ప్రజలకు నాణ్యమైన వైద్యాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంఘం మండల నాయకురాలులు సరిత ,కృష్ణవేణి, మానస, సమ్మక్క, లక్ష్మి, పాల్గొన్నారు.









