◆పిల్లలు స్కూలుకు వెళ్లాలంటే భయాందోళనలో తల్లిదండ్రులు
◆ఏజెన్సీలో విద్య ఈజీ కాదు
నేటి గద్దర్ వాజేడు
ములుగు జిల్లా వాజేడు మండలం ధర్మవరం ప్రాథమిక పాఠశాల గురువారం కురిసిన కుండపోత వర్షానికి నీట మునిగిందని, పాఠశాల చెరువును తలపిస్తుందని గ్రామస్తులు తెలిపారు. పిల్లలు స్కూల్ కి వెళ్లాలంటే తల్లిదండ్రులు భయాందోళనకి గురవుతున్నారని, వర్షాకాలం వచ్చిందంటే, ఈ స్కూల్ పిల్లలకు విద్య అభ్యసించడానికి సౌకర్యవంతంగా ఉండదని తల్లిదండ్రులు, గ్రామస్తులు, సంబంధిత అధికారులకు తెలియజేస్తున్న పట్టించుకోవడంలేదని తెలిపారు. ఏజెన్సీలో విద్యాభ్యసించాలంటే ఈజీ కాదు అంటున్నారు నేటి విజన్లు.
Post Views: 247