సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
స్థానిక మెదక్ పట్టణం లోని పిల్లకొట్యల్ లో ప్రభుత్వ వైద్య కళాశాలను జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఆదివారం పరిశీలించారు
ఈ సందర్భంగా కలెక్టర్ వైద్య కళాశాల క్షుణ్ణంగా పరిశీలించి మెడికల్ సూపర్నెంట్ కు తగు ఆదేశాలు జారీ చేస్తూ వైద్య కళాశాలకు డాక్టర్లు సిబ్బందిని నియమించుకోవడం కొరకు నోటిఫికేషన్ విడుదల చేసి తద్వారా చర్యలు చేపట్టాలని వైద్య కళాశాల బిల్డింగ్ యాజమాన్యం వైద్య కళాశాలలో వసతులు పూర్తిచేసి ఉపయోగం లోకి తీసుకురావాలని ఆదేశించారు.
హెల్త్ సెక్రెటరీ సమావేశంలో మెడికల్ కళాశాల ఏర్పాటుపై చర్చించిన అంశాలను పరిగణలోకి తీసుకోవడం జరిగిందని మెడికల్ కళాశాలకు అనుమతులు వచ్చేవరకు అప్పటివరకు అన్ని సౌకర్యాలు కల్పించి డాక్టర్లు సిబ్బందిని నియమించి విధంగా చర్యలు తీసుకోవాలని అన్నారు.2024-25 సంవత్సరానికి సంబంధించిన ప్రతిష్టాత్మక ప్రణాళిక, చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమంలో మెడికల్ కళాశాల ప్రిన్సిపల్ రవీంద్ర కుమార్, సూపరిండెంట్ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు.