+91 95819 05907

510 జీవో అమలు చేయాలి..లేనిపక్షంలో అసెంబ్లీని ముట్టడిస్తాం.

◆NHM సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలి

◆NHM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా

◆జిల్లా నూతన కమిటీ ఎన్నిక

నేటి గదర్ న్యూస్,హైదరాబాద్ ప్రతినిధి(ఆసిఫాబాద్ జిల్లా న్యూస్):

జాతీయ ఆరోగ్య మిషన్ లో పనిచేస్తున్న వివిధ రకాల సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని NHM రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఆదివారం రోజున ఆసిఫాబాద్లోని మైనార్టీ ఫంక్షన్ హాల్ లో జిల్లా మహాసభ AITUC జిల్లా అధ్యక్షుడు టి.దివాకర్ అధ్యక్షత నిర్వహించడం జరిగింది , ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 7 నెలలు గడుస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల్లో పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు సవరించి పెంచకుండా గత ప్రభుత్వం లాగానే దాట వేస్తుందని, వెంటనే కార్మికులకు కనీస వేతనాలు పెంచాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రామ రాజేష్ ఖన్నా మాట్లాడుతూ అనేక పోరాటాల వల్ల సాధించుకున్న 29 కార్మిక చట్టాలను ఎన్డీయే ప్రభుత్వం పూర్తిగా రద్దు చేసి, కార్మిక హక్కులను కాలరాసే 4 లేబర్ కోడ్లను తీసుకొచ్చి కార్పొరేట్, పెట్టుబ డిదారులకు మేలు చేస్తున్న కోడ్లను రాష్ట్ర ప్రభుత్వం 4 లేబర్ కోడ్లను అమలు చేస్తామని ప్రకటించటం ఎన్డీయే ప్రభుత్వ విధానాలను తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తామనడం హాస్యాస్పదంగా ఉందని ఆయన ఆరోపించారు. నాలుగవ తరగతి సిబ్బంది కనీస వేతనం 26,000 వేతనం ఇవ్వాలని, జాతీయ ఆరోగ్య మిషన్ పని చేస్తున్న 17,000 మందికి శ్రమ దోపిడికి గురవుతూ పేద ప్రజల ఆరోగ్యమే పరమావదిగా భావించి పని చేస్తుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించకుండా కాలయాపన చేయటాన్ని ఆయన విమర్శించారు.ESI, PF సౌకర్యం కల్పించాలని, హెల్త్ కార్డ్స్ ఇవ్వాలని, ప్రతి నెల 1వ తేదీన జీతాలు ఇవ్వాలని, గుర్తింపు కార్డ్స్ ఇవ్వాలని, సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని అన్నారు,510 జీవోని అందరికి అమలు చేయాలని, ప్రమాద భీమా 25 లక్షలు ఇవ్వాలని, దురదృష్ట వశత్తు ఎవరైనా చనిపోతే వారి కుటుంబంలో ఒకరికి 6 నెలల్లోపు ప్రభుత్వ ఉద్యోగులు ఇవ్వాలని అన్నారు, జూలై 24 నుండి జరగనున్న అసెంబ్లీ సమావేశాల సందర్భంగా అసెంబ్లీని ముట్టడిస్తామని అన్నారు,ప్రతి రోజు ఒక యూనియన్ వారి సమస్యల పరిష్కారానికై ఇందిరాపార్కు వద్ద ధర్నాలు నిర్వహించి మంత్రులకు, అధికారులకు మెమోరాండాలు ఇవ్వాలని నిర్ణయించటం జరిగిందని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో NHM స్టేట్ వైస్ ప్రెసిడెంట్ లావుడ్యా సురేష్ నాయక్,రాష్ట్ర నాయకులు కొండ్ర లత,AITUC జిల్లా ప్రధాన కార్యదర్శి బోగే ఉపేందర్, ఉపాధ్యక్షుడు మధుకర్, నాయకులు చిరంజీవి,వినోద్, స్రవంతి, ముస్తక్, శ్రీనివాస్, గోపి కృష్ణ, సాయిలత,మ్రిదుల్ తోపాటు తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

సిపిఐఎం భద్రాచలం పట్టణ కార్యదర్శిగా గడ్డం స్వామి

*కార్యదర్శి వర్గంలో కార్యదర్శి తో పాటు మరో ఆరుగురికి చోటు….* *23 మందితో నూతన పట్టణ కమిటీ ఏకగ్రీవ ఎన్నిక…..* *పలు తీర్మానాలను ఆమోదించిన 8 వ సిపిఐఎం మహాసభ* భద్రాచలం పోరాటాల గడ్డ

Read More »

వైన్ షాపులపై చర్యలు తీసుకోవాలని ఎక్సైజ్ సూపరిండెంట్ కు ఫిర్యాదు:యువజన కాంగ్రెస్

– ప్రజల పక్షాన వారి సమస్యలపై వినతి పత్రం అందజేసిన పాలేరు నియోజకవర్గ యువజన కాంగ్రెస్ ఉపాధ్యక్షులు భూక్య సురేష్ నాయక్ – ఖమ్మం రూరల్: ఖమ్మం రూరల్ మండలంలోని వరంగల్ క్రాస్ రోడ్డు

Read More »

ప్రజా పాలన విజయోత్సవాల వాహనాన్ని అడ్డుకున్న జనం?

గ్రామాలలో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న అబద్ధపు ప్రచారాలను తరిమి కొడుతున్న ప్రజలు సీఎం గారి సొంత జిల్లాలో కాంగ్రెస్ పార్టీకి ఘోర పరాభవం మహబూబ్ నగర్ జిల్లా అడ్డాకుల మండల కేంద్రంలోని బస్టాండ్ వద్ద

Read More »

ఆదివాసీ సంఘల జేఏసీ సమావేశాన్ని విజయవంతం చెయ్యండి.

నేటి గద్దర్ కరకగూడెం:మండల పరిధిలోని రాళ్ళవాగు(పెద్దమ్మతల్లి గుడి)సమీపంలోని ఆదివాసీ సంఘాల జేఏసీ అత్యవసర సమావేశం గురువారం ఏర్పాటు చేయనున్నట్లు జేఏసీ మండల అధ్యక్షులు పోలెబోయిన.వెంకటనారాయణ ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఏజెన్సీ

Read More »

మాలల సింహాగర్జన ను విజయవంతం చేయండి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఐ ఎమ్ ఎల్ ఏ ఖమ్మం ఖమ్మం జిల్లా కోర్టు ఆవరణలో ఇండియన్ మాల లాయర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మాలల

Read More »

ఖమ్మం 53వ డివిజన్లో బిజెపి సభ్యత్వాలు పూర్తి.

నేటి గదర్ న్యూస్, ఖమ్మం జిల్లా ప్రతినిధి, ✍️ సతీష్ కుమార్ జినుగు. ఈరోజు 53వ డివిజన్లో బిజెపి సభ్యతాలు 1000 పూర్తి చేసి ఖమ్మం జిల్లా బిజెపి పార్టీ కార్యాలయంలో జరిగిన సన్నాహసమావేశంలో

Read More »

 Don't Miss this News !