+91 95819 05907

IITలో సీటు వచ్చినా మేకలు కాస్తున్న విద్యార్థినికి సహాయం అందించిన సీఎం రేవంత్ రెడ్డి..

నేటి గదర్ న్యూస్, హైదరాబాద్ ప్రతినిధి(రాజన్న సిరిసిల్ల జిల్లా):
రాజన్న సిరిసిల్ల జిల్లాలోని గోనేనాయక్ తండాకు చెందిన బదావత్ మధులత JEE మెయిన్ లో,ST, 824వ ర్యాంకు సాధించారు.. ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు.

సిరిసిల్ల గిరిజన బిడ్డ ఐఐటీకి వెళ్లేలా..
– పేద విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజా ప్రభుత్వం సాయం
* ముఖ్యమంత్రి ఆదేశాలతో చెక్కు అందజేసిన గిరిజన శాఖ అధికారులు

జేఈఈలో ర్యాంకు ద్వారా పాట్నా ఐఐటీలో సీటు సాధించి, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న సిరిసిల్ల జిల్లా వీర్నపల్లి మండలం గోనేనాయక్ తండాకు చెందిన విద్యార్థిని బాదావత్ మధులతకు ప్రజాప్రభుత్వం అండగా నిలిచింది.

‘ఐఐటీకి వెళ్లలేక.. మేకల కాపరిగా’ అనే శీర్షికతో వార్తాపత్రికల్లో వచ్చిన కథనంపై స్పందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆ పేదింటి చదువులతల్లికి తక్షణమే సహాయం అందించాల్సిందిగా అధికారులను ఆదేశించారు.

సీఎం ఆదేశాల మేరకు గిరిజన శాఖ అధికారులు విద్యార్థిని మధులత వివరాలు తెలుసుకొని మాట్లాడి, వారి కుటుంబాన్ని బుధవారం హైదరాబాద్ కు తీసుకువచ్చారు. సచివాలయంలో గిరిజన శాఖ కార్యదర్శి శరత్ గారి ద్వారా విద్యార్థిని మధులతకు రూ 1,51,831 చెక్కును అందజేశారు.
విద్యార్థిని కోరిక మేరకు హైఎండ్ కంప్యూటర్ కొనుగోలు కోసం ఇప్పుడిచ్చిన రూ.70వేలకు అదనంగా మరో రూ.30వేలు కూడా ఇస్తామని అధికారులు హామీ ఇచ్చారు. భవిష్యత్తులోనూ అండగా ఉంటామని అధికారులు భరోసా ఇచ్చారు.
ఆర్థిక పరిస్థితి కారణంగా ఇక చదువుకోలేనేమో అని ఆందోళన చెందుతోన్న సమయంలో స్వయంగా ముఖ్యమంత్రి గారే మీడియా ద్వారా సమస్యను తెలుసుకొని మానవత్వంతో స్పందించినందుకు సంతోషంగా ఉందని విద్యార్థిని మధులత అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థిని సీఎం కి ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో షెడ్యూల్ ట్రైబల్ కో-ఆపరేటివ్ ఫైనాన్షియల్ డెవలప్‌‌‌‌మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ట్రైకార్) ఛైర్మన్ తేజావత్ బెల్లయ్య నాయక్ , గిరిజన శాఖ అధికారులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బి ఎస్ పి పార్టీ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా దుంపల రవి నియామకం.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. ఏన్కూర్ :ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏనుకూరు మండల అధ్యక్షులుగా దుంపల రవిని నియమిస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధ్యక్షులు

Read More »

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం…జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను !!!

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు,

Read More »

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

ప్రజల భవిష్యత్ కోసం ఉద్యమించాలి….

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం. తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి. రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా

Read More »

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

 Don't Miss this News !