★తెలంగాణ వ్యాప్తంగా అంగరంగ వైభవంగా జరుపుకునే పండగ బోనాలు.
జిల్లా కలెక్టర్
★కుటుంబ సమేతంగా బోనం ఎత్తిన మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
★తారక రామ్ నగర్ కాలనీ నల్ల పోచమ్మ దేవతకు వైభవంగా బోనాల సమర్పించిన జిల్లా కలెక్టర్ దంపతులు
బోనం ఎత్తిన కలెక్టర్ సతీమణి శ్రీజ
★జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్
సిల్వర్ రాజేష్ (నేటి గదర్ ప్రతినిధి మెదక్)
ఆదివారం బోనాల పండుగ సందర్భంగా మెదక్ జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కుటుంబ సమేతంగా మెదక్ పట్టణంలోని తారక రామ నగర్ కాలని లో ఉన్న నల్ల పోచమ్మ ఆలయం లో ప్రత్యేక పూజలుచేసి ,బోనం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూఆషాఢ బోనాల పండగ అంటే గ్రామదేవత అమ్మవారిని పూజించే పండుగ. భోజనం ఫ్రకృతి. బోనం వికృతి. బోనం అంటే భోజనం. దీన్ని కొత్తకుండలో వండి ప్రదర్శనగా వెళ్లి గ్రామదేవతలకు భక్తి ప్రపత్తులతో సమర్పిస్తారని చిన్నముంతలో పానకం పోస్తారని దానిపై దివ్వె పెట్టి బోనంపై జ్యోతిని వెలిగించి జాతరను కన్నుల పండుగగా నిర్వహిస్తారని చెప్పారు.
తెలంగాణ ప్రజలు గ్రామ దేవతలను భక్తి ప్రపత్తులతో నైవేద్యాన్ని బోనం పేరుతో సమర్పిస్తుంటారని చెప్పారు. బోనాలు పండుగను రాష్ట్ర పండుగగా ఉన్నది కాబట్టి బోనాల పండుగ మరింత శోభను సంతరించుకున్నది. సాధారణ ప్రజలే కాదు ప్రభుత్వ ఉన్నతాధికారులు కూడా ఈ ఉత్సవాల్లో పాల్గొని తమ భక్తిని చాటుకుంటున్నారని చెప్పారు.ప్రజలందరూ ఆయుర్ ఆరోగ్యాలతో పాడి పంటలు,సుఖ సంతోషాలతో ఆనందమయం గా ఉండలని వర్షాలు సమృద్ధి గా పడి పంటలు బాగా పండాలని మొక్కులు తీర్చుకున్నరని తెలిపారు.
ఈ కార్యక్రమంలో కలెక్టరేట్ క్యాంపు కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు