నేటి గదర్, జూలై 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో,
అలవాల వంశీ, 9052354516 :
సోమవారం ఆషాడం బోనాలు పండగ సందర్భంగా ప్రభుత్వ సెలవు అయినందున భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంలో జరిగే గిరిజన దర్బార్ రద్దు చేసినట్లు ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆషాడం బోనాల పండుగ సెలవు కాబట్టి ఐటీడీఏ యూనిట్ అధికారులు అందుబాటులో ఉండని కారణంగా గిరిజన దర్బార్ రద్దు చేయడం జరిగిందని, గిరిజనులు ఇట్టి విషయాన్ని గమనించి అర్జీలు సమర్పించడానికి భద్రాచలం ఐటీడీఏ కార్యాలయంకు రావొద్దని ఆయన తెలిపారు.
Post Views: 288