నేటి గదర్, జూలై 28,
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బ్యూరో :
అలవాల వంశీ 9052354516 :
2024 -25 విద్యా సంవత్సరానికి గాను భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం జిల్లాలోని గిరిజన సంక్షేమ గురుకుల జూనియర్ కళాశాలల్లో మొదటి సంవత్సరంలో (జూనియర్ ఇంటర్) నందు MPC,BPC,CEC,HEC,MEC, Vocation గ్రూపులలో మిగిలిన సీట్ల భర్తీ చేయటం కొరకు స్పాట్ కౌన్సిలింగ్ నిర్వహించడం జరుగుతుందని భద్రాచలం ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి బి. రాహుల్ ఒక ప్రకటనలో తెలిపారు. కావున ఆసక్తిగల విద్యార్థిని, విద్యార్థులు ఈనెల 31న, ఉదయం 10 గంటలకు గిరిజన గురుకుల కళాశాల(బాలికలు) భద్రాచలం నందు, ఇటీవలే పదవ తరగతి (2023-24) పూర్తయిన రెగ్యులర్ విద్యార్థులు తప్పకుండా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో (టి సి, ఎస్ ఎస్ సి మార్క్స్ మెమో, స్టడీ అండ్ కండక్ట్, క్యాస్ట్, లేటెస్ట్ ఇన్కమ్ సర్టిఫికెట్, ఆధార్ జిరాక్స్, స్పోర్ట్స్/Orphan/PHC సర్టిఫికెట్, పాస్పోర్ట్ సైజ్ ఫోటో)తో పైన చూపిన తేదీలో కౌన్సిలింగ్ సెంటర్ నందు హాజరు కావాలని, గ్రామీణ ప్రాంత వాసుల వారికి రూపాయలు 1,50,000/-, పట్టణ ప్రాంత వాసులకు రూపాయలు 2,00,000/-లక్షల ఆదాయం కలిగిన వారు అర్హులని, ఈ సదవకాశాన్ని విద్యార్థిని, విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని, కె. నాగార్జున రావు ప్రాంతీయ సమన్వయ అధికారి ఖమ్మం రీజియన్ తెలిపారు.