నేటి గద్దర్ చింతూరు న్యూస్:
చింతూరు, కూనవరం ,జులై 28:- వరద బాధితులకు ఎక్కడికక్కడ వరద సహాయక కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ బి ఎ యస్. దినేష్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం చింతూరు, కూనవరం మండలాల్లోని వరద బాధితులకు వరద సహాయక కార్యక్రమాలు అందినది లేనిది జిల్లా కలెక్టర్ చింతూరు మండలంలోని గొల్ల గుప్ప, వీరపురం, కూనవరం మండలంలోని భద్రాయ గూడెం, తాళ్లగూడెం గ్రామాలలోని జిల్లా కలెక్టర్ నాటు పడవ పై ప్రయాణించి వరద బాధితుల యోగక్షేమాలు తెలుసుకున్నారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు జిల్లా కలెక్టర్ ఏఎస్ దినేష్ కుమార్ మాట్లాడుతూ వరద ప్రాంతాలలోని వరద బాధితులకు ఎక్కడికక్కడ బియ్యం, కూరగాయలు, నిత్యవసర సరుకులు, టార్పాల్స్ , టార్చ్ లైట్లు తదితర సరుకులు వరద బాధితులకు అందజేయడం జరిగిందని ఆయన తెలిపారు. చింతూరు, కూనవరం, వి ఆర్ పురం, ఏటపాక మండలాల్లోని వరద బాధితులకు వరద సహాయక కార్యక్రమాలు ఏర్పాటు చేయుటకు ఎక్కడికక్కడ అధికారులు నియమించడం జరిగిందని అదేవిధంగా ఎక్కడికక్కడ పడవలు, ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. ఈ రెండు మండలాల గ్రామాలలోని ఈరోజు వరద బాధితులతో వరద సహాయక కార్యక్రమాలు అందరికీ అందినది లేనిది అదేవిధంగా వారి సమస్యలు ఆయన అడిగి తెలుసుకున్నారు. వరద బాధితులు ఈ వరదలకు నిర్మించుకున్న తాత్కాలిక గృహాల వద్దకు వెళ్లి ఎలా ఉంటున్నది అదే విధంగా వారి ఆరోగ్య పరిస్థితులను ఆయన ఆరా తీశారు. వరద బాధితుల గ్రామాలలో ఎక్కడికక్కడ పారిశుధ్య కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరిగిందని అదేవిధంగా వరద బాధితులకు అంటువ్యాధులు ప్రబలకుండా ఎక్కడికి అక్కడ ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. వరద బాధితులకు ఏమైనా సమస్యలు ఉన్నాయెడల కంట్రోల్ రూమ్ లో తెలియపరచాలని ఆయన తెలిపారు. ఎక్కడికి అక్కడ వరద సహాయ కార్యక్రమాలు ఏర్పాటు చేసిన వాటిని ఎప్పటికప్పుడు తెలుసుకునే విధంగా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందని ఆయన తెలిపారు. జిల్లా కలెక్టర్ వెంట కూనవరం వరదల ప్రత్యేక అధికారి సూరజ్ గానోరే, చింతూరు ఐటిడిఏ ప్రాజెక్టు అధికారి కావూరి చైతన్య, తాసిల్దార్ నజీముల్లా, ఎంపీడీవో ఎ. లక్ష్మీ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.