బొమ్మనపల్లి గ్రామంలో నిత్యవసర సరుకులు పంపిణీ చేసిన
సీఐ బండారి. కుమార్
ములుగు జిల్లా వాజేడు మండలం బొమ్మనపల్లి గ్రామం గోదావరి ముంపుకు గురయింది. ఈ గ్రామంలో వెంకటాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ బండారి కుమార్, ఎస్సై హరీష్ సందర్శించారు. నిత్యవసర సరుకులు లేక ఇబ్బందులు పడుతున్న గ్రామం ప్రజలకు నిత్యవసర సరుకులు, పంపిణీ చేశారు. ఫ్లడ్ ప్రభావిత ప్రాంతం కాబట్టి ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సీజనల్ వ్యాధుల పట్ల చర్యలు తీసుకోవాలని సీఐ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో జడ్చర్లపల్లి సెక్రటరీ, మాజీ సర్పంచ్ ఆదినారాయణ, గ్రామ పెద్దలు సత్యనారాయణ, శేఖర్ తదితరులు పాల్గొన్నారు.
Post Views: 63