వైరా విజ్ఞాన్ పబ్లిక్ స్కూల్ ఉత్తమ ఉపాధ్యాయులుగా ఆది శ్రీలక్ష్మి,రాధా లక్ష్మి.
మంత్రి తుమ్మల నాగేశ్వరావు చేతుల మీదుగా అవార్డు అందజేత.
నేటి గదర్ న్యూస్ జులై 28:వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.
ఖమ్మం లో జిల్లా ప్రైవేటు పాఠశాల ఉపాధ్యాయులు సమీక్ష సమావేశం జరిగింది.ఈ సమీక్ష సమావేశం లో వైరా లోని విజ్ఞాన్ పబ్లిక్ పాఠశాల లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు
శ్రీ శేషు కుమార్ ఉత్తమ ఉపాధ్యాయుల పురస్కార సభలో ఉత్తమ టీచర్లుగా ఎంపిక అయిన ఆది శ్రీలక్ష్మి, రాధా లక్ష్మి లకు రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా స్కూల్ యాజమాన్యం జయప్రకాష్ మరియు ఉపాధ్యాయులు ఆనందం వ్యక్తం చేశారు.ఈ అవార్డు అందుకోవటం వలనమా బాధ్యత ఇంకా పెరిగింది. స్కూల్ యజమాన్యం సహకారంతో విద్యారంగంలో భావి భారత పౌరులు భవిష్యత్తు కోసం తోడ్పడుతున్న ప్రైవేట్ టీచర్లకి కృతజ్ఞతలు తెలిపారు.