+91 95819 05907

పలు కుటుంబాలకు మంత్రి పొంగులేటి పరామర్శ

★పాల్గొన్న Mla రాందాస్ నాయక్

నేటి గదర్ న్యూస్ జులై 28: వైరా నియోజవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు.

ఖమ్మం రూరల్/కూసుమంచి/వైరా. అనారోగ్య సమస్యతో మరణించిన, చికిత్స పొందుతున్న పార్టీ శ్రేణుల ఇళ్ళకు వెళ్లి రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి ఆదివారం వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కూసుమంచి మండలం జుజుల్ రావు పేట గ్రామంలో పార్టీ సీనియర్ నాయకులు నాగండ్ల నరసింహారావు, రాజుపేట లో ప్రభాకర్ రెడ్డి సతీమణి మరణించగా వారి మృతదేహాల వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. వైరా మండలం లో స్థానిక ఎమ్మెల్యే రాందాస్ నాయక్ తో కలిసి పర్యటించారు. రెబ్బవరంలో భాస్కర్ నాయుడు తండ్రి చనిపోగా వారి కుటుంబాన్ని పరామర్శించారు. వల్లాపురం గ్రామంలో వేల్పుల రామారావుకు శస్త్ర చికిత్స జరగగా. వారి నివాసానికి వెళ్లి యోగ క్షేమాలు తెలుసుకున్నారు. త్వరగా కోలుకోవాలని ఆకాంక్షించారు. ఖమ్మం రూరల్ మండలం వరంగల్ క్రాస్ రోడ్డు వద్ద ఖలీల్ నివాసానికి వెళ్లి. ఇటీవల ఆయన తల్లి మరణించడంతో వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు.
ఈ కార్యక్రమాల్లో వైరా మున్సిపల్ చైర్మన్ సూతకాని జైపాల్, నాయకులు డాక్టర్ కోటా రాంబాబు, శ్రీను, కాంగ్రెస్ ఖమ్మం రూరల్ మండలాధ్యక్షులు కళ్లెం వెంకటరెడ్డి, కూసుమంచి, తిరుమలాయపాలెం ఎంపీపీలు బానోత్ శ్రీనివాస్, మంగీలాల్, మాజీ ఎంపీపీలు జూకూరి గోపాలరావు, కొప్పుల అశోక్, నాయకులు శివరామకృష్ణ, జొన్నలగడ్డ రవి, రామ సహాయం మాధవి రెడ్డి, హఫీజుద్దీన్, మంకెన వాసు, బజ్జూరి వెంకటరెడ్డి, భీష్మా చారి, ఎడవల్లి రామిరెడ్డి, సుధాకర్ రెడ్డి, శీలం వీరభద్రం, పుల్లారెడ్డి, రామిరెడ్డి, పెండ్ర అంజయ్య, జీవన్ రెడ్డి, రమేష్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బి ఎస్ పి పార్టీ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా దుంపల రవి నియామకం.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. ఏన్కూర్ :ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏనుకూరు మండల అధ్యక్షులుగా దుంపల రవిని నియమిస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధ్యక్షులు

Read More »

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం…జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను !!!

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు,

Read More »

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

ప్రజల భవిష్యత్ కోసం ఉద్యమించాలి….

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం. తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి. రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా

Read More »

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

 Don't Miss this News !