★ప్రభుత్వం ఉపాధ్యాయుల నిర్లక్ష్యనికి బాలుడు మృతి
నేటి గదర్ న్యూస్, దమ్మపేట. జులై దమ్మపేట మండలం లో ప్రభుత్వ పాఠశాలకు వచ్చిన బాలుడు శవమై కనిపించడం తో తల్లి దండ్రులు గుండెలు బాదు కుంటున్నారు. విధులపట్ల ఉపాధ్యాయుల నిర్లక్షం తో పసి ప్రాయం లోనే తనువు చలించాల్సి వచ్చింది.వివరాల్లోకి వెళితే దమ్మపేట మండలం అర్లపెంట గ్రామం లోని ప్రభుత్వ పాఠశాల లో తొలేమ్ వరుణ్ (7) సంవత్సరాలు 2వ తరగతి చదువు తున్నాడు. బడికి వచ్చిన బాలుడు కనిపించడం లేదని గ్రామస్థులు వెతకడం తో సమీపంలో లోని వాగులో శవమై కనిపించాడు. బాలుని యొక్క బంధువులు రోడ్డుపై బయటయించి న్యాయం చెయ్యాలని రోడ్డుపై రాస్తారోకో చేస్తున్నారు.
Post Views: 1,198