+91 95819 05907

ఫ్లాష్..💥ఫ్లాష్💥:జాతీయ ఆరోగ్య మిషన్ ఉద్యోగులు హైదరాబాద్ కమిషనర్ కార్యాలయం ముందు మహాధర్నా

◆ఎన్ హెచ్ ఎం రాష్ట్ర అధ్యక్షులు ఎం నరసింహ, జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రామ రాజేష్ ఖన్నా.

నేటి గదర్ న్యూస్, హైదరాబాద్:
ఎన్ హెచ్ ఎం లో పనిచేస్తున్న వివిధ రకాల సిబ్బందిని ఎలాంటి షరతులు లేకుండా రెగ్యులర్ చేయాలని జాతీయ ఆరోగ్య మిషన్ రాష్ట్ర అధ్యక్షులు ఎన్ నరసింహ మాట్లాడుతూ కమిషనర్ కార్యాలయం ముందుట మహాధర్నా నిర్వహించడం జరిగింది. వైద్య ఆరోగ్యశాఖలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ అండ్ ఔట్సోర్సింగ్ ప్రభుత్వం రెగ్యులర్ చేయాలని లేదా సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని ఈరోజు ధర్నా ద్వారా ప్రభుత్వాన్ని హెచ్చరించడం జరిగింది. జాతీయ ఆరోగ్య మిషిన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాట్లాడుతూ .. తెలంగాణ రాష్ట్రంలో 17514 ఎన్హెచ్ఎంలో ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారని , శ్రమ దోపిడికి గురవుతూ పేద ప్రజల ఆరోగ్యమే పరమావదిగా భావించి పని చేస్తుంటే వారిని ప్రభుత్వ ఉద్యోగులుగా నియమించకుండా కాలయాపన చేయటాన్ని విమర్శించారు. గత ఏడు నెలల పిఆర్సి బకాయిలు మరియు మహిళా ఉద్యోగులకు 180 రోజుల వేతనంతో కూడిన సెలవులు మంజూరు చేయాలని,హెల్త్ కార్డ్స్, ఇన్సూరెన్స్, ప్రభుత్వాలను డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 8నెలలు గడుస్తున్న ప్రభుత్వ, ప్రభుత్వ సంస్థల్లో దిగులకు పనిచేస్తున్న జాతీయ ఆరోగ్య మిషన్ కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు కనీస వేతనాలు 4వ తరగతి సిబ్బందికి 26వేల రూపాయలు వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు, 4000 మందికి 510 జీవోలో అన్యాయం జరిగింది వారికి న్యాయం చేయాలని జీవో సవరించి పెంచకుండా గత ప్రభుత్వం లాగానే దాట వేస్తుందని, వెంటనే కనీస వేతనాలు పెంచాలని ధర్నా ద్వారా తెలియజేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర వైస్ ప్రెసిడెంట్ నూకల అంజి మాట్లాడుతూ ప్రభుత్వం వెంటనే హెచ్ఆర్డీఏ పాలసీ ఇంప్లిమెంటేషన్ చేయాలని ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. ఈ కార్యక్రమంలో పద్మ, జ్యోతి, శ్రావణ్, అనిత, తిరుమలేష్, సంతోష్, కరుణ, దేవనబోయిన బాపు యాదవ్, రాజ్ కుమార్, మల్లేష్, మునీర్, అనిల్ యాదవ్, తదితరులు పాల్గొన్నారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !