★బిట్స్ భూపాలపల్లి లో మొలకెత్తే గింజల ప్రయోజనాలపై అవగాహన సదస్సు
నేటి గదర్ వెబ్ డెస్క్ :
(జయశంకర్ భూపాలపల్లి జిల్లా) జులై 30:
జయశంకర్ జిల్లాలో గల స్థానిక బాలాజీ ఇంటిగ్రేటెడ్ టీచింగ్ స్కూల్ భూపాలపల్లి లోని పౌష్టిక ఆహారంపై అవగాహన సదస్సు పాఠశాల ప్రధానోపాధ్యాయులు ఎన్ .రాజేష్ కుమార్ చౌదరి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు మాట్లాడుతూ విద్యార్థులకు మొలకెత్తే గింజలు తీసుకోవడం వలన ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని ఇవి ప్రతిరోజూ ఉదయం అల్పాహారంగా లేదా సాయంత్రం చిరుతిండిగా మొలకలు తినడం అలవాటు చేసుకోవాలి అని మొలకెత్తిన గింజల్లో పోషకాలు నిండుగా ఉంటాయి కావున క్రమం తప్పకుండా తినడం ద్వారా గొప్ప ఆరోగ్య ప్రయోజనాలను అందిస్తాయి అదేవిధంగా వివిధ రకాల విటమిన్లతో పాటు ఇనుము, రాగి, మెగ్నీషియం, పొటాషియం వంటి మినరల్స్ సమృద్ధిగా ఉంటాయి కావునా ఇవి తినడం ద్వారా శరీరంలో ఎర్ర రక్త కణాలు గణనీయంగా పెరుగుతాయి, తద్వారా శరీరమంతా ఆరోగ్యకరమైన రక్త ప్రసరణ జరిగి, పోషకాలు, ఆక్సిజన్ సరఫరా పెరుగుతుంది.మరియు
మెరుగైన జీర్ణశక్తి కోసం
మొలకెత్తిన ధాన్యాలు జీర్ణక్రియ ప్రయోజనాలకు చాలా ప్రసిద్ది. ఎందుకంటే వీటిలో పీచు పదార్థంతో పాటు జీవక్రియకు మద్దతు ఇచ్చే ఎంజైమ్‌లు పుష్కలంగా ఉంటాయి. మొలకలలో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణక్రియను క్రమబద్ధీకరించడానికి, సాధారణ ప్రేగు కదలికలకు తోడ్పడుతుంది. త్వరగా పోషకాల శోషణ జరుగుతుంది శక్తి త్వరగా లభిస్తుంది. మొలకలను క్రమం తప్పకుండా తీసుకోవడం ద్వారా మలబద్ధకం, ఉబ్బరం, అజీర్ణం వంటి సమస్యలను నివారించవచ్చు మరియు బ్లడ్ సర్క్యులేషన్ కూడా పెంచుతుంది అదేవిధంగా గుండెకు ,కంటి చూపును కూడా మెరుగుపరుస్తుంది అని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు విద్యార్థుల తల్లిదండ్రులు మరియు ఉపాధ్యాయునిలు అనిత,మౌనిక, లత, రమ్య,స్వరూప పాల్గొన్నారు.