నేటి గదర్ న్యూస్,ఖమ్మం ప్రతినిధి:
మాన్యశ్రీ మందకృష్ణ మాదిగ 30 సంవత్సరాల సుదీర్ఘ పోరాట ఫలితం సుప్రీంకోర్టు తీర్పు ద్వారా ఎస్సీ వర్గీకరణకు న్యాయం జరిగిందని ఈ సందర్భంగా ఉద్యమ వీరుడు మందకృష్ణ మాదిగ ఎన్ని కష్టాలు ఎదురైనా సహనం కోల్పోకుండా పోరాటం చేసినటువంటి నాయకుడికి వారికి సహకరించినటువంటి ఎమ్మార్పీఎస్ ఉద్యమ సోదరులకు ఉప కులాలకు సంబంధించినటువంటి యువకులకు అందరికీ జిల్లా బిజెపి నాయకులు మహేందర్ నాయక్ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. వారికి పూర్తిస్థాయిలో సహకరించినటువంటి ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ కి మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్య నాయుడు , కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రివర్యులు తెలంగాణ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ అధ్యక్షులు జి కిషన్ రెడ్డి కి ,కేంద్ర హోం శాఖ సహాయ మంత్రివర్యులు సంజయ్ కుమార్ కి, రాజ్యసభ సభ్యులు కోవా లక్ష్మణ్ గారికి జాతీయ నాయకులు మన ఖమ్మం జిల్లా ముద్దుబిడ్డ పొంగులేటి సుధాకర్ రెడ్డి కి హృదయపూర్వక ధన్యవాదా లు తెలిపారు. అణగారిన వర్గాల అభ్యున్నతి కేవలం బిజెపి పార్టీ, దేశ ప్రధాని నరేంద్ర మోడీతోనే సాధ్యమవుతుందని ఆయన అన్నారు.
