నేటి గదర్ న్యూస్,ఆగస్టు 1 (పాలేరు నియోజకవర్గ ప్రతినిధి కొమ్ము ప్రభాకర్ రావు)
సుప్రింకోర్టు ధర్మాసనం ఎస్సీ వర్గీకరణకు అనుకూలంగా తీర్పు ఇవ్వడంతో మాదిగలు సంబరాలు చేసుకున్నారు.. వివరాల్లోకి వెళ్తే కూసుమంచి మండలం తురక గూడెం గ్రామంలోని ఎమ్మార్పీఎస్ ,మాదిగ శ్రేణులు సుప్రీం కోర్టు తీర్పు పట్ల హర్షం వ్యక్తం చేస్తూ సంబరాలు చేసుకున్నారు.. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడారు.. ఎన్నో సంవత్సరాలుగా మాదిగలు ఎస్సీ వర్గీకరణ కోసం ఉద్యమం చేశారు.. ఈ పోరాటంలో ఎంతో మంది నాయకులు అసువులు బాసారు… మంద కృష్ణమాదిగ నాయకత్వంలో జరిగిన ఉద్యమం కొత్త చరిత్రకు సజీవ సాక్ష్యం అన్నారు.. ఎస్సీ వర్గీకరణకు మద్దతు తెలిపిన అన్ని వర్గాల నాయకులకు, పార్టీలకు కృతజ్ఞతలు తెలిపారు.. ఎస్సీ వర్గీకరణతో మాదిగ ,మాదిగ ఉప కులాలకు న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉందని అన్నారు.. ఈ సందర్భంగా మంద కృష్ణమాదిగ కు అభినందనలు తెలిపుతూ గ్రామ బొడ్రాయి సెంటర్లో కేక్ కట్ చేసి, బాణ సంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు కొమ్ము రోశయ్య ,కాంగ్రెస్ గ్రామ శాఖ ఎస్సీ సెల్ అధ్యక్షుడు కొమ్ము ప్రభాకర్ రావు, కొమ్ము సుధాకర్ ,సంపంగి రామూర్తి, కొమ్ము వెంకటేశ్వర్లు ,వసుకుల రామారావు , కొమ్ము వెంకటేశ్వర్లు ,కొమ్ము పిరయ్య ,కొమ్ము అశోక్, వసుకుల వీరప్రసాద్ ,కొమ్ము నవీన్ ,సంపంగి రవి కుమార్ తదితరులు పాల్గొన్నారు..