★మాదిగల ఆత్మగౌరవ ప్రతీకకు సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయం…
★న్యాయం,ధర్మం గెలిచింది…
★30 ఏళ్ల అనేక పోరాటాల ఫలితమే వర్గీకరణ…
■వివిధ పార్టీల నాయకులు సంఘీభావం…
నేటి గదర్ న్యూస్,ప్రత్యేక ప్రతినిధి మణుగూరు ఆగస్టు 02:
ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని ప్రకాశం జిల్లా లోని ఈదుమూడి అనే కూ గ్రామంలో 20 మంది యువకులతో మంద కృష్ణ మాదిగ ఆధ్వర్యంలో ఏర్పడిన ఉద్యమం.రాను రాను దేశ రాజకీయాల్లో కీలక ఘట్టంగా మారిందని ఎంఆర్పిఎస్ సీనియర్ నాయకులు బోయ జగన్నాథం, బోయిళ్ళ వెంకటేశ్వర్లు, బోయిళ్ళ నరసింహారావు పేర్కొన్నారు.మాదిగల ఆత్మగౌరవ ప్రతీకకు సుప్రీంకోర్టు తీర్పు హర్షనీయమని అన్నారు.సుప్రీంకోర్టు తీర్పు న్యాయాన్ని,ధర్మాన్ని నిలబెట్టి సామాజిక న్యాయం వైపు నిలబడిందని,ఈ తీర్పు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలకు రాజ్యాంగ స్ఫూర్తికి నిలువెత్తు నిదర్శనమని కొనియాడారు.
30 ఏళ్ల ఉద్యమానికి సుప్రీంకోర్టు ధర్మాసనం 7గురి జడ్జీలతో కూడిన తీర్పుకు
మాదిగల చిరకాల కోరిక ఎస్సీ వర్గీకరణ 30 సంవత్సరాల పోరాటానికి భారతదేశ అత్యున్నత న్యాయస్థానము ఇచ్చిన తీర్పు
ఎస్సీ ఎస్టీలలో వర్గీకరణ సమర్థనీయమని,దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గదని అన్నారు.ఈ తీర్పు ఎమ్మార్పీఎస్ ఉద్యమంలో ఆశువులు బాసిన మాదిగ అమర వీరులకు అంకితమని అన్నారు.ఈ సందర్భంగా మణుగూరు అంబేద్కర్ సెంటర్ లోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్,కొమరం భీమ్ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.మాన్యశ్రీ మంద కృష్ణ మాదిగ చిత్రపటానికి పాలాభిషేకం చేశారు.ఈ ఉద్యమానికి అన్ని రకాలుగా సహాయ సహకారాలు అందించిన అన్ని వర్గాల ప్రజలకు ప్రజాస్వామ్య వాదులకు హృదయపూర్వక ఉద్యమాభి వందనాలు తెలియజేశారు.ఈ కార్యక్రమానికి బిజెపి నాయకులు పొన్నం బిక్షపతి,టిడిపి నాయకులు వాసిరెడ్డి చలపతిరావు,కాంగ్రెస్ నాయకులు గుడిపూడి కోటేశ్వరరావు,బిసి సంఘం నాయకులు గుండ్ల వెంకటేశ్వరరావు (జి వి ఆర్) డాక్టర్ దుస్స సమ్మయ్య,వలసాల వెంకట రామారావు,రుద్ర నాగరాజు,గాండ్ల సురేష్ సంఘీభావం తెలుపుతూ మాట్లాడారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ సింగరేణి మాదిగ ఉద్యోగుల సంఘం సీనియర్ నాయకులు కనకయ్య ,రాజలింగం,సంఘం జిల్లా,మండల నాయకులు ఉసికల కొండయ్య,బాసిపోగు వెంకటేశ్వర్లు,కుందూరు సత్యనారాయణ, మోదుగు వెంకటేశ్వర్లు,బోయిల్ల రాజు,చిట్యాల రజిత,జీడి దేవి,బాస్కుల పద్మ తదితరులు పాల్గొన్నారు.