★రైతులకు కేసీఆర్ బేడీలు వేస్తే మేము రుణ విముక్తులను చేశాం
★బీఆర్ఎస్ నేతలంతా మాయలోళ్లు
★ఖమ్మ జిల్లా రైతులకు బేడీలు వేసిన చరిత్ర మాజీ సీఎం కేసీఆర్ ది
★ అదే గడ్డ మీద రైతు రుణమాఫీ చేసిన ఘనత సీఎం రేవంత్ రెడ్డి
నేటి గదర్ న్యూస్,నాగర్ కర్నూల్: రైతులకు రుణమాఫీ చేస్తానని ప్రకటించిన రేవంత్ రెడ్డి ఆ మాటకు కట్టుబడి ఆగస్టులోపు రెండు లక్షల రుణమాఫీ చేశారని అదే మాటకు కట్టుబడి మాజీ మంత్రి,బీఆర్ ఎస్ నేత, ఎమ్మెల్యే హరీష్ రావు అమరుల సాక్షిగా చేసిన ప్రమాణం మేరకు తక్షణమే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలనిబయ్యారం పట్టణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నాయిని శ్రీనివాస్ రెడ్డి డిమాండ్ చేశారు.
వైరా వేదికగా మూడో విడతలో రూ.2 లక్షల రుణాలు మాఫీ. చేయటం చరిత్ర అన్నారు
పంద్రాగస్టులోగా రుణమాఫీ జరగదన్న మాజీమంత్రి హరీష్ రావు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. మాట మీద నిలబడని మాయలోళ్లు అంతా బీఆర్ఎస్ లో ఉన్నారని ఎద్దెవా చేశారు.
ఇచ్చిన హామీలు మహిళలకు ఉచిత బస్సు, కరెంట్ ఫ్రీ, గ్యాస్ ధర తగ్గింపు, రైతు రుణమాఫీ సహా గ్యారెంటీలన్నింటీని అమలు చేస్తున్న ఘనత సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ దక్కుతుందన్నారు.