◆అధిక వర్షాల వల్ల కలిగే నష్టాన్ని నివారించడానికి పలు సూచనలు తెలియజేసిన – మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ విజయ చంద్ర
నేటి గద్దర్ న్యూస్ ముదిగొండ మండల ప్రతినిధి మరికంటి బాబురావు
శనివారం ముదిగొండ మండలంలోని అమ్మపేట పండ్రేగుపల్లి మరియు వల్లాపురం,ముదిగొండ తదితర గ్రామాలలో మధిర వ్యవసాయ సహాయ సంచాలకులు ఎస్ విజయచంద్ర అధిక వర్షాల ద్వారా పంట నష్టం అయినటువంటి వరి,పత్తి,కొన్ని రకాల పంటలను పరిశీలించారు. నష్టపోయిన రైతులను ఎవరిని వదలకుండా ప్రతి పొలం పరిశీలించి రాయాలని ఏఈఓలకు సూచించారు .అధిక వర్షాలు ద్వారా కలిగే నష్టాన్ని నివారించడానికి ప్రత్తిలో తీసుకోవలసినటువంటి యాజమాన్య చర్యలను రైతులకు ఏడిఏ వివరించారు .రైతులు ప్రత్తిలో మురుగునీరు తీసివేసి ఎకరానికి 20 నుంచి 25 కేజీలు యూరియా మరియు 10 కేజీలు పొటాష్ ఎరువులను వేయాలని సూచించారు. మరియు 19:19:19 లేదా 14: 0: 35 లను లీటరు నీటికి 10 గ్రాముల చొప్పున కలిపి వారం వ్యవధిలో రెండుసార్లు పిచికారి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడిఏ తో పాటు వ్యవసాయ అధికారి సరిత, ఏఈఓ లు ఇందు, భవాని, పవన్ కళ్యాణ్,మౌనిక మరియు రైతులు తదితరులు పాల్గొన్నారు.