★ ఏడుల్ల బయ్యారం పోలీస్ స్టేషన్ ప్రాంగణంలో పోలీసు పిల్లలకు దొరికిన పర్సన్ ఎస్సై కి అప్పగించిన చిన్నారులు
★పోలీస్ పిల్లల ఔదార్యం.అభినందించిన ఎస్ ఐ రాజ్ కుమార్
నేటి గదర్ న్యూస్,పినపాక: పిల్లలకు చిన్న వయస్సులోనే మంచి తప్పుల మధ్య వ్యత్యాసాన్ని నేర్పించాలి:SI రాజకుమా సూచించారు.
వివరాల్లోకి వెళితే..
ఏడూళ్ళ బయ్యారం పోలీస్ స్టేషన్ లో వివిధ సమస్యలపై భాదితులు, ప్రజలు స్టేషన్ కు వస్తుంటారు.. అలా వచ్చిన వారిలో ఎవరో తమ పర్స్ ను పోగొట్టుకున్నారు. అయితే ఆ సమీపం లోనే ఆడుకుంటున్న పోలీస్ ల పిల్లలకు ఆ పర్స్ దొరకడంతో వెంటనే ఏడూళ్ళ బయ్యారం ఎస్ ఐ రాజ్ కుమార్ కు అందజేసి, తమ తల్లిదండ్రులు తమకు ఎలాంటి విలువలు విద్య నేర్పుతున్నారో నిరూపించారు.. ఈ సందర్భంగా ఎస్సై రాజకుమార్ పిల్లలను శభాష్ అంటూ మెచ్చుకుని అభినందించారు.
Post Views: 69