+91 95819 05907

గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలి:కలెక్టర్

– ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద సరైన సౌకర్యాలు కల్పించాలి
– జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్

పినపాక

ధాన్యం కొనుగోలు వేగవంతంగా చేయాలని,
గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడాలని జిల్లా కలెక్టర్
జితేశ్వి పాటిల్ అధికారులను ఆదేశించారు. సోమవారం ఆయన పినపాక మండలంలో ఆకస్మికంగా పర్యటించి ప్రస్తుత వానాకాలం రైతులు పండించిన ధాన్యం సేకరణ చేయుచున్న ప్రభుత్వ ఏజన్సీలను ఆకస్మికంగా తనిఖీ చేశారు.పినపాక మండలము ఉప్పాక గ్రామములో డిసియంస్ ద్వారా నిర్వహిస్తున్నటువంటి కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ తనిఖీ చేసి నాణ్యతా ప్రమాణాలను అనగా తేమ శాతము చూసే యంత్రము తో స్వయంగా ధాన్యాన్ని తన చేతులతో తీసుకుని మిషన్ లో పోసి స్వయంగా తనిఖీ చేశారు. పేడిఅస్క్ రిమూవర్ తో బియ్యాన్ని వేరు చేసి అందులో సరియైన బియ్యపు గింజని పొడవు వెడల్పుని కెర్నర్ కేలిఫర్తో కొలిచి సన్నరకాల పరిధిలోకి వస్తుందా రావటంలేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు. రైతులకు అనేక సూచనలు సలహలు యిచ్చి అవగాహన కల్పించారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్ణయించినటువంటి కనీస మద్దతు ధరతో పాటు రాష్ట్ర ప్రభుత్వ అదనముగా కల్పిస్తున్నటు వంటి బోనస్ ఐదు వందల రూపాయలను రైతులు సద్వినియోగం చేసుకోవలసినదిగా తెలియజేశారు. అనంతరం
పినపాక గ్రామములో నిర్వహిస్తున్నటువంటి పిఎసియస్ కేంద్రాన్ని పరిశీలించారు. స్థానిక ఏఈఓ లు నాణ్యతా ప్రమాణాలు ముందుగానే రైతుల పొలాల్లోనే పరిశీలించాలాన్నారు. నాణ్యతా ప్రమాణాలు వచ్చిన తర్వాత మాత్రమే కొనుగోలు కేంద్రానికి పంపవలసినదిగా ఏఈఓ లను ఆదేశించారు. గన్నీ బ్యాగుల కొరత లేకుండా చూడవలసినదిగా అధికారులను ఆదేశించారు. అకాల వర్షాలకు ధాన్యం పాడైపోకుండా సరిపోను టార్పాలిన్స్ అందుబాటులో ఉంచుకోవలసినదిగా ఆదేశించారు. పేడీ క్లీనర్స్ సరిపోను ఉండేట్లు చూడవలసినదిగా ఆదేశించారు. రైతులకు త్రాగునీరు సరఫరా చేవలసినదిగా ఆదేశించారు. టాగింగ్ చేసిన బిల్లులకు మాత్రమే వాహనాలు పంపవలసినదిగా ఆదేశించారు. అలాగే ఎ గ్రేడ్ రకాలకు ప్రత్యేకముగా వాహనాలలో పంపాలని, సన్నాలకు ప్రత్యేకముగా వాహనాలు ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించినారు. సాదారణ రకాలు ప్రత్యేకముగా వాహనాలు ఏర్పాటు చేయవలసినదిగా ఆదేశించినారు. ఈ కార్యక్రమములో జిల్లా సహకార అధికారి కుర్షీద్ అహ్మద్, డి.సి.యం.స్. మేనేజర్, సిబ్బంది, ఎడిఎ బి. తాతారావు , మండల పరిషత్ అభివృద్ధి అధికారి రామకృష్ణ , తహసిల్దార్ నరేష్ , వ్యవసాయ అధికారి వెంకటేశ్వర్లు, మండల పంచాయితి అధికారి వెంకటేశ్వరరావు, ఎ.పి.యం.ఐ.కె.పి జ్యోతి , ఎపివొ.ఇజియస్ వీరభద్ర స్వామి, సెక్రటరీలు, స్థానిక అధికారులు, రైతులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

బి ఎస్ పి పార్టీ ఏన్కూర్ మండల అధ్యక్షులుగా దుంపల రవి నియామకం.

నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. ఏన్కూర్ :ఈరోజు ఖమ్మం జిల్లాలో జరిగినటువంటి సమీక్ష సమావేశంలో ఏనుకూరు మండల అధ్యక్షులుగా దుంపల రవిని నియమిస్తున్నట్టు ఖమ్మం జిల్లా అధ్యక్షులు

Read More »

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం…జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను !!!

పోసాని కృష్ణమురళి సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఇకపై రాజకీయాలు మాట్లాడను.. తన జీవితాంతం ఇంకా రాజకీయాల జోలికి పోను అని ప్రకటించారు. ఇన్నేళ్ల జీవితం నేను ఎవరికి తలవంచలేదు.. ఆడవాళ్ళనే ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారు,

Read More »

లగచర్ల రైతులపై నిర్బంధాన్ని వెంటనే ఆపాలి.

◆ రైతులపై పెట్టిన కేసులను ఎత్తివేయాలని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన. నేటి గదర్ న్యూస్ నవంబర్ 21: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు. తెలంగాణ గిరిజన సంఘం, తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం,

Read More »

ప్రజల భవిష్యత్ కోసం ఉద్యమించాలి….

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ పోరాటం ప్రణాళిక రూపొందిద్దాం. తొమ్మిదవ మండల మహాసభను జయప్రదం చేయండి. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు కె.బ్రహ్మచారి. రానున్న మూడు సంవత్సరాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలపై నిర్వహించే ప్రజా

Read More »

కబ్జా కు గురవుతున్న రోడ్డు మార్గాలు.!

చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్ మారుమూల గ్రామలలో సైతం కబ్జా రాయుల్లు.! భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండలం తిప్పాపురం గ్రామపంచాయతీ లోని ఉన్న రెవిన్యూ భూమిని సైతం కబ్జా కోరల్లోకి వెళ్తుంది. తిప్పాపురం

Read More »

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు

ఆదరిస్తే శాసన మండలిలో గళం విప్పుతా – భారత రాష్ట్ర సమితి పార్టీ (బీ. ఆర్. ఎస్ ) ఆశవాహ ఎమ్మెల్సీ అభ్యర్థి పిడిశెట్టి రాజు కరీంనగర్ జిల్లా : నవంబర్ 21,(హుస్నాబాద్ భార్గవాపురం

Read More »

 Don't Miss this News !