చర్ల నేటి గదర్ ప్రతినిధి:వరప్రసాద్
వరుస భేటీలతో కార్యకర్తల్లో కొత్త ఊపు.!
స్థానిక సంస్థల ఎన్నికలే లక్ష్యం.!
ఈరోజు చర్ల మండలం లోని తిప్పాపురం గ్రామం మరియు పెద్దముసీలేరు గ్రామం లోని బిఆర్ఎస్ పార్టీ గ్రామ స్థాయి సమావేశం లో చర్ల బిఆర్ఎస్ పార్టీ మండల కన్వీనర్ దొడ్డి తాతారావు కో కన్వీనర్ ఐనవోలు పవన్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అవలంబిస్తున్న ప్రజా వ్యతిరేక పాలనను దుయ్యబట్టారు. రేపు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి ఒక్క కార్యకర్త సైనికుల పనిచేసి మన బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. డిసెంబర్ ఒకటో తారీకు చర్ల శ్రీనివాస కళ్యాణ మండపం లో జరిగే మండల స్థాయి సమావేశానికి అత్యధికంగా బిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు అత్యధికంగా పాల్గొని ఈ యొక్క సభను విజయవంతం చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు SD అజీజ్ కాకి అనిల్ తిప్పాపురం మాజీ సర్పంచ్ కారం కన్నారావు పాయం శ్రీనివాసరావు మరియు నాయకులు కార్యకర్తలు అత్యధిక సంఖ్యలో పాల్గొనడం జరిగింది.









