ఖమ్మం ఖానాపురం హవేలి31,2024*: రాష్ట్ర ప్రభుత్వం జలకు ఇచ్చిన ఆరుగ్యారంటీలు అమలు చేయకపోతే *2025 సంవత్సరం అంతా ప్రజలను సమీకరించి ఉధృతంగా ప్రజా పోరాటాలు నిర్వహిస్తామని సిపిఎం రాష్ట్ర కమిటీ సభ్యులు యర్రా శ్రీకాంత్ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. మంగళవారం వడ్డేపల్లి నరేంద్ర అధ్యక్షతన జరిగిన ఖానాపురం హవేలీ మండల కమిటీ సమావేశంలో శ్రీకాంత్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు ప్రజలకు ఆరు గ్యారెంటీల పేరుతో అనేక వాగ్దానాలు చేసి ఏ ఒక్కటి పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం తప్ప మిగతావన్నీ* పాక్షికంగా అమలు జరిపి మేం మొదటి సంవత్సరంలోనే అన్ని హామీలు అమలు చేశామని గొప్పలు చెప్పడం కోసం సభలు జరపడం సిగ్గుచేటని ఆయన ఎద్దేవా చేశారు. ప్రధానంగా *ఖమ్మం నగరంలో అనేక సమస్యలు పేరుకుపోయి ఉన్నాయని నగర పాలన నత్తనడకన సాగుతోందని శ్రీకాంత్ ఆరోపించారు. ఖమ్మం నగరంలో వేలాదిమంది ఇళ్ల స్థలాలు లేక సొంత ఇల్లు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని ప్రజా పాలనలో దరఖాస్తు చేసుకున్నప్పటికీ సర్వేల పేరుతో కాలయాపన చేస్తున్నారే తప్ప పథకాల అమలు కావడం లేదని ప్రభుత్వం వెంటనే స్పందించి అర్హులను గుర్తించి వారికి వెంటనే ఇళ్ల స్థలాలు ఇందిరమ్మ ఇళ్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఖమ్మం డివిజన్ కార్యదర్శి వై విక్రమ్ మాట్లాడుతూ ఖమ్మం నగరంలో ప్రభుత్వ స్థలాలు కబ్జాకు గురవుతుంటే అధికారులు చూచి చూడనట్లు వ్యవహరించడం* సరైన కాదని ప్రభుత్వ స్థలాలను కాపాడాల్సిన బాధ్యత అధికారులపై ఉందని, కబ్జాదారులపై చర్యలు తీసుకొని ప్రభుత్వ స్థలాలను కాపాడకపోతే భవిష్యత్తులో ప్రజలను సమీకరించి పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో పార్టీ మండల కార్యదర్శి దొంగల తిరుపతిరావు మాట్లాడుతూ ఖానాపురం హవేలీ పరిధిలో ఉన్న అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య కార్మికులు సరిపోయినంతమంది లేకపోవడం వల్ల పారిశుద్ధ్యం పడకే సిందని వెంటనే అన్ని డివిజన్లలో పారిశుద్ధ్య కార్మికుల సంఖ్యను పెంచి ఎప్పటికప్పుడు డ్రైనేజీలు, రోడ్లు శుభ్రపరిచి ప్రజలను అనారోగ్య సమస్యల నుండి కాపాడాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా కమిటీ సభ్యులు పిన్నింటి రమ్య, డివిజన్ కమిటీ సభ్యులు పోతురాజు వెంకటి, కత్తుల అమరావతి, గాలి వెంకటాద్రి మరియు మండల కమిటీ సభ్యులు పాల్గొన్నారు.
