రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) డిసెంబర్ 31:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం ఆధ్వర్యంలో పిఎసిఎస్ చైర్మన్ బాదే చంద్రం 2025 నూతన సంవత్సరం క్యాలెండర్ ను ఆవిష్కరించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహకార సంఘం క్రింద ఉన్న మండలంలోని రైతులందరూ నూతన సంవత్సరంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా రైతులు పాడి పంటలు పండించి సుఖ సంతోషాలతో చల్లగా ఉండాలని ఆయన తెలిపారు.సహకార సంఘం మరింత అభివృద్ధి చెందే దిశగా రైతులందరూ అన్ని రంగాల్లో సహకరించాలని ఆయన సూచించారు.ఈ కార్యక్రమంలో డైరెక్టర్లు పి.సుధాకర్ రెడ్డి,వి.లక్ష్మారెడ్డి లద్ద నర్సింలు,మాసాయిపేట మల్లేశం సీఈఓ పుట్టి నర్సింలు తదితరులు పాల్గొన్నారు.
Post Views: 79