పినపాక
పినపాక మండలం ఈ బయ్యారం క్రాస్ రోడ్ లో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయాన్ని మాజీ తెలంగాణ ప్రభుత్వ విప్, బీఆర్ఎస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అధ్యక్షులు, మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. నాయకులు, కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి రాబోయే పంచాయతీ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులను గెలిపించుకోవాలని పిలుపునిచ్చారు. గ్రామాల్లో పార్టీ కార్యకర్తలు బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు ప్రవేశపెడుతన్న సంక్షేమ పథకాలను , కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలను సూచించాలన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు సతీష్ రెడ్డి, సీనియర్ నాయకులు భవాని శంకర్, మాజీ జెడ్పిటిసి సుభద్ర దేవి వాసు బాబు, భద్రయ్య, రవి శేఖర్ వర్మ, దొడ్డ శ్రీనివాస్ రెడ్డి, వెంకటేశ్వర రెడ్డి, బీసీ సంఘం నాయకులు సత్తిబాబు, డాక్టర్ శ్రీరామ్, మాజీ ప్రజా ప్రతినిధులు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.