ఘనంగా బీఆర్ఎస్ పార్టీ నూతన కార్యాలయం ప్రారంభం
. పార్టీ కార్యాలయ ప్రారంబానికే అశేష జనం
. గులాబి పుస్తకంలో ప్రతీ ఒక్కరి పేరూ ఉంటుంది
. రేగా రాజ్యాంగం తప్పక అమలవుతుంది.
పినపాక,
పినపాక మండలం ఏడూళ్ళ బయ్యారం క్రాస్ రోడ్ లోని పాత పెట్రోల్ బంక్ సమీపంలో నూతన బీఆర్ఎస్ పార్టీ కార్యాలయాన్ని బుధవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు , మాజీ శాసనసభ్యులు రేగా కాంతారావు ప్రారంభించారు. ముందుగా పార్టీ జెండా ఆవిష్కరించి కార్యాలయంలో రిబ్బన్ కత్తిరించి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… ముందుగా బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు, నాయకులకు నూతన సంవత్సర శుభాకాక్షలు తెలిపారు.వచ్చే నాలుగు సంవత్సరాలు గతంలో కంటే ఎక్కువగా నియోజకవర్గంలో పర్యటించి కార్యకర్తలకు ఎల్లవేళలా అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. కాంగ్రెస్ నాయకులు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టించి వారిని భయబ్రాంతులకు గురిచేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారన్నారు. తనతో పాటు మండల నాయకులు కూడా కార్యకర్తలకు అండగా ఉండాలని పార్టీ శ్రేణులకు సూచించారు.సంవత్సర కాలంలోనే మునుపెన్నడూ లేనివిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రజావ్యతిరేక ముద్రను మూటకట్టుకుందన్నారు. నాడు కాంగ్రెస్ పార్టీకి ఓట్లు వేసి గెలిపించిన ప్రజలు నేడు నెత్తి,నోరు కొట్టుకుంటున్నారన్నారు. తప్పకుండా మళ్ళీ వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే మూడో సారి ముఖ్యమంత్రి అయ్యేది కెసిఆర్ అని జోస్యం చెప్పారు. ఎవరైతే చిల్లర రాజకీయాలు చేసి కార్యకర్తలను ఇబ్బందుల పాలు చేసి,పార్టీని బదనాం చేస్తున్నారో వారిని గులాబి పుస్తకంలో ఎక్కించనున్నట్లు తెలిపారు. గులాబి పుస్తకంలో మొదటగా పినపాక మండలం నుండే పేర్లు నమోదు కానున్నట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలుగాని హామీలతో, ఆచరణ సాధ్యం గాని పథకాలతో, తుపాకి రాముని మాటలతో యావత్ తెలంగాణ ప్రజలను మోసం చేసిన పార్టీ గా కాంగ్రెస్ నిలుస్తుందన్నారు. సంక్రాంతి తరువాత గ్రామస్థాయి నుండి కొత్త కమిటీలు వేసి పార్టీని బలోపేతం చేయనున్నట్లు తెలిపారు. కార్యకర్తలు,నాయకులు నూతనోత్సాహంతో పనిచేసి
వచ్చే స్థానిక సంస్థల ఎన్నికలలో పార్టీ విజయానికి కృషిచేయాలని కోరారు.ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ మండలాద్యక్షులు పగడాల సతీష్ రెడ్డి, ఉపాధ్యక్షులు కటకం గణేష్ కుమార్, పార్టీ సీనియర్ నాయకులు జిల్లా అధికార ప్రతినిధి కోలేటి భవాని శంకర్, పటేల్ భద్రయ్య, వాసుబాబు, ప్రాథమిక సహకార సంఘం చైర్మన్ ఎంవిఆర్ఎస్ వర్మ, కొండేరు రాము, మాజీ సర్పంచులు, ఉప సర్పంచులు, ఎంపీటీసీలు, పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.