+91 95819 05907

ఫిబ్రవరి 4 న కళాకారుల ఎంపిక :ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్

-ప్రజా గాయకుడు సిద్దెల హుస్సేన్
పినపాక :ప్రముఖ సినీగేయ రచయిత, వాగ్గేయకారుడు ప్రజా కవి వరంగల్ శ్రీనివాస్ గారు రచించిన “నూరేళ్ల నా ఊరు”గేయ కావ్యం 243 చరణాలతో 243 మంది గాయని&గాయకుల చేత పాడించాలనే సంకల్పం తో కళాకారుల ఎంపిక ఫిబ్రవరి 4వ తేదిన, శనివారం ఉదయం 9:00 గంటల నుండి ఖమ్మం పట్టణంలోని అంబేద్కర్ భవనం అందు ఈ కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది అని ప్రముఖ ప్రజా గాయకుడు రచయిత సిద్దెల హుస్సేన్ పత్రికా సమావేశంలో తెలియజేశారు.
అనంతరం పెద్ద ఎత్తున ఆవిష్కరణ కార్యక్రమం పాట ప్రదర్శన ఉంటుందని
ఇందులో భాగంగా రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అనేక మట్టి గొంతులను వెలికి తీసి ఈ పాటలో భాగస్వామ్యం చేయాలనే ఆలోచనతో,
నూరేండ్ల ఊరు ఎట్లుండెను, ఆనాటి ప్రజల జీవన స్థితిగతులు ఏ విధంగా ఉన్నాయో,సమాజం ప్రస్తుతం ఎంత మార్పు జరిగిందో, మనుషుల్లో వచ్చినటువంటి మార్పుని మానసిక పరిస్థితులను గురించి విపులంగా విశదీకరించి కవితాత్మకంగా రాసిన సుదీర్ఘ గేయ కావ్యం పాడడం కోసం కళాకారులను ఎంపిక చేయడం నిజంగా సంతోషించదగినటువంటి విషయం అని సిద్దెల హుస్సేన్ తెలిపారు,
ఇంత గొప్ప కార్యక్రమంలో ఉమ్మడి ఖమ్మం జిల్లా కళాకారులు భాగస్వామ్యం అవ్వడం అనేది మనకు దక్కిన వరంగా భావిస్తూ మన ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని కళాకారులు ఎవరైనా సరే తమకు నచ్చిన పాటను పాడి వరంగల్ శ్రీనన్నను మెప్పించి ఈ 243 చరణాల పాటలో భాగస్వామ్యం అవ్వడానికి అవకాశం పొందాలని,
అనే విషయాన్ని తెలియజేస్తూ మనం పాడే పాటలకు న్యాయ నిర్ణేత గా “నూరేళ్ళ నా ఊరు” గేయకావ్య రచయిత వరంగల్ శ్రీను పాల్గొంటారు,
కాబట్టి భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం కళాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని కోరుకుంటున్నాను.
ఇది ఉమ్మడి ఖమ్మం జిల్లాల్లోని కళాకారులకు గొప్ప సదవకాశంగా భావించి పెద్ద ఎత్తున ఈ గాయని గాయకుల ఎంపిక కార్యక్రమంలో పాల్గొని మీ మీ ప్రతిభను వెలికి తీసే విధంగా పెద్ద ఎత్తున హాజరై కార్యక్రమాన్ని విజయవంతం చేయగలరని, ఎంపిక కార్యక్రమంలో పాల్గొనే కళాకారులకు భోజనం వసతి కూడా ఏర్పాటు చేయడం జరిగిందని సిద్దెల హుస్సేన్ తెలియజేశారు

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

ఫుట్బాల్ పోటీలలో విజయసారధిగా దూసుకుపోతున్న బుల్లెట్ శరత్చంద్ర

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- స్కూల్ ఫెడరేషన్ స్టేట్ లెవెల్ ఫుట్బాల్ పోటీలలో మెదక్ జట్టు వరంగల్ పై మూడు సున్నా గోల్స్ తో గెలుపొందింది.మహబూబ్ నగర్ జిల్లా వనపర్తిలో ఈనెల

Read More »

రామాయంపేట మండలంలో ఘనంగా హోలీ పండుగ సంబరాలు

రామాయంపేట (నేటి గదర్ ప్రతినిధి) మార్చి 14:- మెదక్ జిల్లా రామాయంపేట మండలంలో భారతీయ సంస్కృతి సాంప్రదాయాలకు ప్రతీకగా శుక్రవారం రోజు ఉదయం 6 గంటల నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు రామాయంపేట

Read More »

గ్రీన్ కార్డు ఉన్నా తరిమేస్తాం…తేల్చేసిన అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్

అమెరికాలో ఇప్పటివరకూ అక్రమంగా వలస వచ్చి ఉంటున్న వారిపై ఉరుముతున్న ట్రంప్ సర్కార్ ఇప్పుడు గ్రీన్ కార్డు దారులపైనా కత్తి దూస్తోంది. *గ్రీన్ కార్డు ఉన్నంత మాత్రాన అమెరికాలో శాశ్వతంగా ఉండొచ్చన్న గ్యారంటీ లేదని

Read More »

జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు

ఖమ్మం శ్రీనివాస్ నగర్ లో ఉన్న ఆశ్రమం నందు జాయ్ ఫామిలీ కిట్టి ఆధ్వర్యంలో హోలీ వేడుకలు చాలా ఘనంగా నిర్వహించారు . ప్రేమానురాగాలతో, ఆత్మీయతలకు ప్రతీకగా రంగులు చల్లుకుంటు , బంధాలను చాటిచెబుతు

Read More »

మండల వ్యాప్తంగా ఘనంగా హోలీ సంబరాలు

నేటి గదర్ న్యూస్, పినపాక : పినపాక మండల కేంద్రంతో పాటు మండలంలోని పలు గ్రామాలలో శుక్రవారం హోలీ పండుగ ఘనంగా జరుపుకున్నారు. హోలీ పండుగ రోజు చిన్న పెద్ద లేకుండా గ్రామాలలో రంగులు

Read More »

ముసలమ్మ జాతరకు వస్తూ ….ప్రాణాలు కోల్పోయిండు

ప్రమాదం లో ప్రాణాలు కోల్పోయిన యువకుడు. నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట. మంగపేట మండలం బాలన్నగూడెంనకు చెందిన దన్నూరి సాయి కుమార్ (22) యువకుడు తన తోటి స్నేహితుడు ద్వి చక్ర వాహనం

Read More »

 Don't Miss this News !