నేటి గదర్ న్యూస్ జనవరి2:వైరా నియోజకవర్గ ప్రతినిది
జూలూరుపాడు మండలానికి ఆర్ఐ గా నూతనంగా బాధ్యతలు స్వీకరించిన చీమల ఆదినారాయణను ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి శాలువాతో ఘనంగా సత్కరించిన బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు, భారతీయ గోర్ బంజర పోరాట సంఘం ఉమ్మడి ఖమ్మం జిల్లా అధ్యక్షులు బానోత్ దుర్గాప్రసాద్, ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షులు దేబ్బిందల సాయికుమార్ కలిసి ఘనంగా సత్కరించడం జరిగిందని వారు తెలియజేశారు.అదే విధంగా జూలూరుపాడు మండలం పూర్తి ఏజెన్సీ ప్రాంతం ఏజెన్సీలో ట్రైబల్ పేద ప్రజలే కాకుండా వెనకబడిన షెడ్యూల్ కులాలకు చెందిన చాలామంది పేద ప్రజలు ఉన్నారని వారికి రాజ్యాంగబద్ధంగా ప్రతి ఒక్కరికి న్యాయం జరిగేలాగా కృషి చేయాలని వారు వారిని కోరినట్టుగా తెలియజేశారు.
Post Views: 137