+91 95819 05907

బీఆర్ఎస్ నాయకులపై మండిపడ్డ టిపిసీసీ అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్

రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 7:- మెదక్ జిల్లా రామయంపేట మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు.ఈ సందర్భంగా టిపిసి రాష్ట్ర అధికార ప్రతినిధి పల్లె రామచంద్రం గౌడ్ మాట్లాడుతూ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తప్పు చేయలేనప్పుడు కోర్టుకు ఎందుకు వెళ్లడం అని ప్రశ్నించారు.బీఆర్ఎస్ నాయకులు కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వంపై అవాకులు చెవాకులు పేల్చడం ఎంతవరకు సమంజసం అన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమిపాలు కావడంతో వారి ఆశలు అడియాసలు అయ్యాయన్నారు.ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పూర్తిగా భూస్థాపితం అయిందన్నారు.ఆ పార్టీ మళ్లీ అధికారంలోకి రావడం అనేది కలగానే మిగిలిపోతుందన్నారు.అధికారం కోల్పోయామనే అక్కసుతో కాంగ్రెస్ ప్రభుత్వంపై బురదజల్లుతున్నారని మండిపడ్డారు.రాజకీయ లబ్ధి కోసం గోబెల్స్ ప్రచారం చేస్తున్నారని అన్నారు.తెలంగాణను ఇచ్చిన పార్టీ రుణం తీర్చుకునేందుకు ప్రజలు కాంగ్రెస్ కు అధికారం కట్టబెట్టారని అన్నారు.దేశానికి, రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీయే శ్రీరామ రక్ష అని ఆయన అన్నారు.తెలంగాణ రాష్ట్రంలో ఇందిరమ్మ పాలన కొనసాగుతుందని ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేస్తున్నామని ఆయన అన్నారు.రైతు రుణమాఫీ,మహిళలకు ఉచిత బస్ ప్రయాణం రూ.500 కే గ్యాస్ సిలిండర్, ప్రతీ పేద కుటుంబానికి 200 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ పరిమితి పెంపు, ఇందిరమ్మ ఇండ్లు వంటి ఎన్నో పథకాలు అమలు చేస్తున్న ఘనత కాంగ్రెస్ పార్టీకే దక్కిందన్నారు.త్వరలోనే రైతు భరోసా,ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకం కింద భూమిలేని వ్యవసాయ కూలీలకు ఏడాదికి 12 వేల రూపాయల సాయం అందజేస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటించారని పేర్కొన్నారు.గతంలో రాష్ట్ర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా, ఏ పాలకులు చేయని అప్పులను బీఆర్ఎస్ పార్టీ చేసి
గతంలో 8 లక్షల కోట్ల అప్పులు చేసిన ఘనత మీకే దక్కిందన్నారు.అసలు,వడ్డీ కలిపి నెలకు 6500 కోట్లు చెల్లించవలసిన పరిస్థితి ఏర్పడిందన్నారు.ఇలాంటి దుర్భర పరిస్థితుల్లో కూడా ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేరుస్తుందని తెలిపారు.గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా నెరవేర్చలేదని,బీఆర్ఎస్ పాలనలో ప్రగతి భవన్, సచివాలయంలోనికి పోలేని పరిస్థితులు ఉండేవన్నారు.ఇవాళ ప్రజలు స్వేచ్ఛగా మంత్రులను,అధికారులను కలుస్తున్నారంటే కాంగ్రెస్ ప్రభుత్వ నాయకుల పనితీరు అని చెప్పవచ్చన్నారు.గత పది సంవత్సరాల కాలంలో హరీష్ రావు కేటీఆర్ కవిత బీఆర్ఎస్ ప్రభుత్వం బీసీలకు చేసింది ఏముందని అన్నారు.అదే కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతులకు నిరుద్యోగులకు నిరుపేదలకు అనేక సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తుందని అన్నారు.అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రాష్ట్రంలో అన్ని వర్గాల వారికి చేయూతను కల్పిస్తూ ముందుకు కొనసాగుతుందన్నారు.రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు కల్లబొల్లి మాటలు చెప్పి అధికారంలోకి రావాలని చూస్తున్నారని అన్నారు.కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం పై విమర్శించే నైతిక హక్కు కూడా మీకు లేదని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు విప్లవ కుమార్, మామిడి సిద్ధ రాములు, తౌర్య నాయక్, ఎర్రం సత్యం,బొట్ల బాబు,శంకరయ్య తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !