రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 7:- మెదక్ జిల్లా రామాయంపేట మండలం లక్ష్మాపూర్ గ్రామంలో సుతిలి బాంబులతో ఓ ఇంటిపై దాడి చేసిన ఘటన చోటుచేసుకుంది.పోలీసుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి.లక్ష్మాపూర్ గ్రామానికి చెందిన నడిమింటి రాజమణి ఇంటి పైన గుర్తు తెలియని దుండగులు దీపావళి పటాసులు గత సోమవారం అర్ధరాత్రి 12 గంటల సమయంలో వేసి దాడి చేశారు.సుతిలి బాంబులు గుర్తుతెలియని దుండగులు వేయడంతో పెంకుటిల్లు పూర్తిగా దెబ్బతిన్నది.ఈ విషయం పై కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఘటన స్థలానికి వెళ్లి పూర్తిస్థాయిలో పరిశీలించడం జరిగింది.ఇట్టి నేరాన్ని చేసిన వారిపైన చట్టపరమైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని రామాయంపేట ఎస్సై బాలరాజ్ తెలిపారు.
Post Views: 160









