+91 95819 05907

మినీ మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి:మంత్రి సీతక్క

ములుగు జిల్లా.

మినీ మేడారం జాతర పనులను సకాలంలో పూర్తి చేయాలి.

అన్ని పనులు నాణ్యతతో శశ్వతంగా నిలిచే విధంగా ఉండాలి.

భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలిగించవద్దు.

జాతర విజయవంతనికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో కృషి చేయాలి…

రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క.

****

ఫిబ్రవరి 12 నుండి 15వ తేదీ వరకు జరగనున్న మినీ మేడారం జాతరకు చేపట్టిన అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని,
ప్రతి పని నాణ్యతతో చేపట్టి శాశ్వతంగా నిలిచిపోయేలా ఉండాలని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అన్నారు.

మహా జాతర సందర్భంగా జరిగిన చిన్న చిన్న సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని అన్నారు. రానున్న మినీ మేడారం జాతరను పురస్కరించుకొని రాష్ట్ర పంచాయితి రాజ్, గ్రామీణ అభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా, శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క మంగళవారం సాయంకాలం జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి అతిథి గృహంలో జిల్లా కలెక్టర్ దివాకర్ టి.ఎస్, ఎస్పీ శభరీష్, ఐటీడీఏ పిఓ చిత్ర మిశ్రా, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ జాదవ్ లతో కలిసి వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు.

ఈ సందర్భంగా వివిధ శాఖల అధికారులు ఆయా శాఖల ద్వారా చేపట్టనున్న పనుల అంచనా వివరాలను మంత్రికి సమర్పించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మినీ మేడం జాతరను పురస్కరించుకొని గత పక్షం రోజులుగా భక్తులు రాక పెరిగిపోయిందని, ఫిబ్రవరి మొదటి వారం నుండే భక్తుల తాకిడి అధికం కానున్న సందర్భంలో అన్ని శాఖల అధికారులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. మేడారం జాతరకు వచ్చి అన్ని లింక్ రోడ్లను జనవరి 31 లోగా పూర్తిచేసే విధంగా చర్యలు తీసుకోవాలని, అమ్మవార్ల ను భక్తులు దర్శించుకునే సమయంలో ఎలాంటి ఇబ్బందులు కలగకుండా క్యూలైన్లను ఏర్పాటు చేయడంతో పాటు మంచినీటి సౌకర్యం కల్పించాలని ఆదేశించారు. జాతర సందర్భంగా పారిశుద్ధ్య లోపం జరగకుండా ప్రత్యేక పారిశుద్ధ్య కార్మికులను ఏర్పాటు చేయాలని డిపిఓను ఆదేశించారు. ఐదు రోజులపాటు నిరంతరం విద్యుత్ సరఫరా చేయడంతోపాటు, పూర్తిస్థాయిలో మరుగుదొడ్లను ఏర్పాటు చేయాలని, జాతర సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీసు యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్నారు. జంపన్న వాగు వద్ద మహిళా భక్తులు పుణ్య స్నానాలు ఆచరించిన అనంతరం బట్టలు మార్చుకోవడానికి ప్రత్యేక షెడ్యూల్ ఏర్పాటు చేయాలని, భక్తులకు అవసరమే పనులను త్వరగా చేపట్టేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కు సూచించారు.

జిల్లా అధికారులు సమర్పించిన అంచనాల వివరాలను ప్రభుత్వం దృష్టికి తీసుకుపోయి అవసరం కానున్న నిధులను మంజూరు చేయిస్తానని, జాతర విషయంలో జిల్లా యంతరంగంతో పాటు ఐటిడిఏ అధికారులు ముందస్తు చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ సమావేశం లో ఎండోమెంట్ ఈ ఓ రాజేందర్, ఇంజనీరింగ్ అధికారులు,
వివిధ శాఖల జిల్లా అధికారులు, ఐటిడిఎ అధికారులు,
తదితరులు పాల్గొన్నారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !