+91 95819 05907

భూమాత పోర్టల్ అమలు కు ముందు మాడ్యూల్లో తలెత్తే సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు పై నివేదికలు సమర్పించాలి :జిల్లా కలెక్టర్

భూమాత మాడ్యూల్ అమలు కు ముందే మాడ్యూల్లో సమస్యలు , వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు పై నివేదికలు సమర్పించాలి : జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్.

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెడుతున్న భూమాత పోర్టల్ అమలకు ముందు మాడ్యూల్లో తలెత్తే సమస్యలు మరియు వాటి పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలపై మంగళవారం ఐడిఓసి కార్యాలయం సమావేశ మందిరం నుండి జిల్లా కలెక్టర్ జితేష్ వి. పాటిల్, అదనపు కలెక్టర్ డి వేణుగోపాల్ తో కలిసి ఆర్డీవోలు మరియు తాసిల్దార్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూమాత మాడ్యూల్ అమలు లో భాగంగా పోర్టల్ లో తలెత్తే సమస్యలు మరియు వాటి పరిష్కార మార్గాలకు తీసుకోవలసిన చర్యలను అందరూ తాసిల్దారులు లిఖితపూర్వకంగా నిర్దేశిత పట్టిక ద్వారా తెలియజేయాలని ఆదేశించారు. వచ్చిన సూచనలు మరియు సలహాలను ఉన్నతాధికారులకు పంపడం ద్వారా మాడ్యూల్ లో మార్పులు చేయడానికి అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్న భూ సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఆర్ ఓ ఆర్ చట్టం మరియు కొత్త చట్టం పై తాసిల్దార్లకు పూర్తి అవగాహన ఉండాలని అన్నారు. జిల్లాలోని అన్ని గ్రామాలు,మండలాల పరిధిలో ఉన్న అటవీ శాఖ భూముల వివరాలను అటవీ శాఖ గెజిటెడ్ మరియు రెవెన్యూ రికార్డులతో సరిచూసి ఏ సర్వే నెంబర్లు ఎంత అటవీ భూములు ఉన్నాయో గుర్తించాలని ఆదేశించారు. దీని ద్వారా మిగిలిన ప్రభుత్వ భూములను ఎయిర్ పోర్ట్, ఇరిగేషన్ ప్రాజెక్టులు, రోడ్లు వంటి తదితర అభివృద్ధి పనులకు ఉపయోగించుకోవచ్చు అని కలెక్టర్ తెలిపారు.

Ad:

Facebook
Twitter
WhatsApp
Telegram
Email

టాప్ న్యూస్

మరిన్ని వార్తలు చూడండి :

గ్రామాల్లో గుడుంబా తయారీ, వినియోగంపై ప్రత్యేక దృష్టి సారించాలి:జిల్లా కలెక్టర్ అంకిత్

మాదకద్రవ్యాల అక్రమ రవాణా, వినియోగాన్ని పూర్తిగా అరికట్టాలి: జిల్లా కలెక్టర్ అంకిత్ గారు జిల్లాలో మాదకద్రవ్యాల నియంత్రణకు సంబంధిత శాఖలు సమన్వయంతో కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ అంకిత్ ఆదేశించారు. జిల్లా ఎస్పీ

Read More »

మహిళలు ప్రభుత్వ పథకాలను సద్వినియోగం చేసుకోవాలి:ఐకెపి ఎపిఎం విజయ

పినపాక మండల కేంద్రంలోని మండల సమాఖ్య కార్యాలయం వద్ద మహిళా సమాఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఐకెపి ఎపిఎం విజయ మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలను

Read More »

ఉగాది సంబరాలు

ఉగాది సంబరాలు పినపాక ఉగాది పండుగ సందర్భంగా పినపాక మండల వ్యాప్తంగా పలు పాఠశాలల్లో సంబరాలు ఘనంగా నిర్వహించారు. విద్యార్థులు సంప్రదాయ దుస్తుల్లో హాజరై ఉగాది పచ్చడి ప్రాముఖ్యతను తెలుసుకున్నారు. ఉపాధ్యాయులు ఉగాది విశిష్టత,

Read More »

నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో మరోసారి సత్తా చాటిన ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని

పినపాక: నవోదయ ఎంట్రన్స్ పరీక్షలో ఈ బయ్యారంలో గల ఎక్స్ లెంట్ భాషా హై స్కూల్ విద్యార్థిని శేరు వేదాన్సిక అత్యంత ప్రతిభ కనబరచి 17వ ర్యాంకును సొంతం చేసుకొని, ఆరవ తరగతికి సీటు

Read More »

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ

నేటి తరానికి ఆదర్శం కామ్రేడ్ మాడపాటి కమలమ్మ ఘనంగా కామ్రేడ్ మాడపాటి కమలమ్మ 25వ వర్ధంతి నిరంతర పోరాటాలే కమలమ్మకు నిజమైన నివాళి సిపిఐ(ఎం) వైరా డివిజన్ కార్యదర్శి భూక్యా వీరభద్రం, జిల్లా కార్యదర్శివర్గ

Read More »

రూ. 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ : జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి

నేటి గదర్ న్యూస్, ఖమ్మం : 196 కోట్లతో ఖమ్మం కార్పొరేషన్ బడ్జెట్ ప్రతిపాదించడం జరిగిందని జిల్లా కలెక్టర్ అనుదీప్ దురిశెట్టి తెలిపారు.బుధవారం ఖమ్మం మున్సిపల్ కార్పోరేషన్ లో నగర మేయర్ పునుకొల్లు నీరజ

Read More »

 Don't Miss this News !