◆హావేళ్ళి ఘణపూర్ మండల బిజెపి అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి.
మెదక్ రూరల్ (రవి) నేటి గద్దర్ జనవరి 08.
మెదక్ జిల్లా హవేలీ ఘణపూర్ మండల కేంద్రంలో బుధవారం రోజున బిజెపి మండల శాఖ తరపున బిజెపి మండల అధ్యక్షుడు ఈర్ల రంజిత్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రెస్ మీట్ నిర్వహించడం జరిగింది మెదక్ ఎంపీ శ్రీ మాధవనేని రఘునందన్ రావు NREGA నిధుల కింద హవేలీ ఘనపూర్ మండలం వాడి గ్రామానికి 5 లక్షల రూపాయల ఇంటర్నల్ సిసి రోడ్ సాంక్షన్ చేయడం జరిగింది. ఇందుకు మెదక్ ఎంపికి కృతజ్ఞత తెలుపుతూ హవేలీ ఘణపూర్ ప్రజానీకానికి మరిన్ని అభివృద్ధి పనులు భారతీయ జనతా పార్టీ మండల శాఖ తరపున మెదక్ ఎంపీ రఘునందన్ రావు గారిని కోరుతామని తెలియజేసుకుంటూ ఎంపీ గారికి ధన్యవాదాలు తెలియజేసుకోవడం జరిగింది. ఇట్టి కార్యక్రమంలో మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి MLN రెడ్డి,హవేలి ఘనపూర్ మండల ప్రధాన కార్యదర్శి వదలపర్తి శ్రీనివాస్, మెదక్ జిల్లా బిజెపి సోషల్ మీడియా కోర్ కమిటీ మెంబర్ నాయక వాడి బిక్షపతి, కిసాన్ మోర్చా మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏసి రెడ్డి, బీజేవైఎం నాయకులు విష్ణువర్ధన్ రెడ్డి, మనోహర్, రాజు, తదితరులు పాల్గొన్నారు.









