నేటి గదర్ న్యూస్ జనవరి08: వైరా నియోజకవర్గ ప్రతినిధి
మల్టీ పర్పస్ విధానం జీవో నెంబర్ 51 ని రద్దు చేయాలి
బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల అధ్యక్షులు తంబర్ల నరసింహారావు మాట్లాడుతూ
జూలూరుపాడు మండల లో గ్రామపంచాయతీ కార్మికులకు ఆగినటువంటి జీతాలు తక్షణమే చెల్లించాలి అదేవిధంగా పనిచేస్తున్న గ్రామపంచాయతీ కార్మికుల మల్టీ పర్పస్ విధానం జీవో నెంబర్ 51 ను వెంటనే రద్దుచేసి మండల వ్యాప్తంగా ఉన్న 24 గ్రామపంచాయతీలో పనిచేస్తున్న 86 మంది గ్రామపంచాయతీ కార్మికుల మీద పడుతున్న అధిక భారాన్ని తగ్గించాలని ఆయన అన్నారు మల్టీపర్పస్ విధానం వల్ల వారు ప్రతి పని చేయాల్సి వస్తుంది ప్రతిరోజు ప్రమాదంతో ప్రాణాలు వదులుతూ ఉన్నారు గత రెండు సంవత్సరాల క్రితం గుండెపుడి గ్రామపంచాయతీలో పనిచేస్తున్న కార్మికుడు సురేష్ విద్యుత్ బలుపులు బిగించే సమయంలో కరెంట్ షాక్ తగలడం వలన కరెంట్ పోల్ నుండి కింద పడటం జరిగినది ఎంతో ఖర్చు చేసి కుటుంబ సభ్యులు సురేష్ కు వైద్యం చేయించడం జరిగినది అదేవిధంగా చింతల తండా గ్రామపంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్ బానోత్ తరుణ్ మల్టీ పర్పస్ వర్క్ లో భాగంగా 11 కెవి లయన్ కింద ఉన్న చెట్టు కొమ్మలను కొడుతున్న క్రమంలో కరెంట్ షాక్కు గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోవడం జరిగినది కావున మరల జూలూరుపాడు మండల పరిధిలో గ్రామ పంచాయతీలలో పనిచేస్తున్న కార్మికులు ప్రాణాలు పోకుండా ఉండాలి అంటే తక్షణమే మల్టీ పర్పస్ విధానాన్ని జీవో నెంబర్ 51 ను రద్దు చేసి గ్రామపంచాయతీ కార్మికులను కాపాడాలి అదేవిధంగా ఆగినటువంటి జీతాలు తక్షణమే చెల్లించాలని ఈరోజు మండల సూపర్డెంట్ తాళ్లూరి రవి గారికి వినతి పత్రం అందించడం జరిగినది ఈ కార్యక్రమంలో బహుజన్ సమాజ్ పార్టీ జూలూరుపాడు మండల కార్యదర్శి గార్లపాటి సైదులు. ఎం నరసింహారావు తదితరులు పాల్గొన్నారు









