_(మెదక్ రూరల్ రవి నేటి గద్దర్ )జనవరి 08._
బుదవారం రోజు LV ప్రసాద్ హాస్పిటల్ హైదరాబాద్, డాక్టర్ MS Reddy Lions Eye హాస్పిటల్, మౌలాలి బ్రాంచ్ వారి (హాస్పిటల్ చైర్మన్ శ్రీ రాంచందర్ ) ఆధ్వర్యంలో శంకరంపేట్ (R) మండల పరిధిలోని PS గజగట్లపల్లి, PS సంగాయిపల్లి, PS కొర్విపల్లి LT, PS గెరిల్లతాండ, UPS గవ్వలపల్లి PS ప్యాటగడ్డ పాఠశాలల విద్యార్థులకు ఉచితంగా Eye screening (కంటి పరీక్షలు ) చేయడం జరిగింది. ఈ కంటి పరీక్షలు చేసిన పిదప అవసరం ఉన్న విద్యార్థులకు కళ్ల అద్దాలు ఇవ్వడంతో పాటు, ఇంకా ఎక్కువగా ప్రాబ్లమ్ ఉన్న విద్యార్థులకు కంటి హాస్పిటల్ కు వెళ్ళవలసిందిగా సూచించారు. విద్యార్థులకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉన్నాగాని వారి హాస్పిటల్ కు వెళ్తే ఉచితంగా వైద్యం అందిస్తామని LV ప్రసాద్ హాస్పిటల్, MS రెడ్డి లయన్స్ eye(కంటి ) హాస్పిటల్ మౌలాలి బ్రాంచ్ హైదరాబాద్ నుండి వచ్చిన డాక్టర్స్ బృందం తెలిపారు. ఈ వైద్య పరీక్షలు MEO పుష్పవేణి మేడం గారు,పాఠశాలలలో చదువుతున్న విద్యార్థుల మీద ప్రేమతో, ప్రత్యేకమైన చొరవ తీసుకొని హాస్పిటల్ యాజమాన్యంతో మాట్లాడి ఉచితంగా కంటి పరీక్షలు చేయించారు. MEO పుష్పవేణి మేడం గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది.









