◆రైతుల ధాన్యం సమస్యలు పరిష్కారానికి ఎమ్మార్వో కి వినతి
మణుగూరు:- పగడేరు రైతు ధాన్యం కొనుగోలు కేంద్రంలో స్థానిక ఎమ్మార్వో రాఘవ రెడ్డి గారికి సిపిఎం పార్టీ ప్రతినిధి బృందం మరియు రైతులు వారి సమస్యలు పరిష్కారానికి. స్థానిక ఎమ్మార్వో గారికి సమస్యలపై వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సిపిఎం మండల కార్యదర్శి. సత్ర పల్లి సాంబశివరావు మాట్లాడుతూ. ఆరు కాలం సాగించుకున్న పంటని గద్దల తనుకు పోవాలనే విధంగా మిల్లర్లు దళారులు రైతులను చూసుకుంటున్నారని. కొనుగోలు కేంద్రంలో నిబంధనలకు లోబడి చేసుకొని ధాన్యం ను మిల్లర్ల కాడికి తీసుకెళ్తే అక్కడ మిల్లర్లు ఇష్టం వచ్చిన రీతిలో ధాన్యం బాగా లేవని ఏదో ఒక సాగు చెప్పి అదనంగా రెండు మూడు కేజీలు కింటా కి దోచుకోవాలని చూస్తున్నారని రైతులు నష్టపోతున్నారని. పాత బత్తాల తోటి గింజలని నింపుకోవడం వల్ల పాత బస్తాలో మిగిలిన ఒకటి రెండు గింజలు సాకుగా చూపించి దోచుకోవాలని చూస్తే ఊరుకునేది లేదని అటువంటి వారిపై చర్యలు తీసుకోవాలని. స్థానిక ఎమ్మార్వో గారికి వినతిపత్రం సమర్పించారు. అనంతరం ఎమ్మార్వో గారు రైతులకు సుమారు 15000 కొత్త బస్తాలు మరి ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోలు జరుగుతుందని వారికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో. సిపిఎం మండల కమిటీ సభ్యులు కుంజరాజు. శాఖ కార్యదర్శి నరసింహారావు. KCR రాజా. రామారావు. నాగమణి. తెల్లం భద్రయ్య. వజ్జ సూరయ్య కుంజ నారాయణ. సోడి వెంకన్న. తదితరులు రైతులు పాల్గొన్నారు.









