◆ నేటి గదర్ వద్ద ఆధారాలు
మాసాయిపేట మండలం (భూపాల్) నేటి గద్దర్ జనవరి 25.
మెదక్ జిల్లా మాసాయిపేట మండల కేంద్రంలో గత 2021- నుండి 2023 వరకు ఉపాధి హామీ పథకం లో భారీగా అవకతవకులు జరిగినట్టు మరియు పనిచేయనీ వారికి కూడా కూలి చెల్లించినట్టు 18 సంవత్సరాల వయసు పూర్తికాని వారితో పని చేయించినట్టు ఇటీవలే జరిగినటువంటి గ్రామ సభలో మాసాయిపేట గ్రామస్తులు ఆరోపించారు. తక్షణమే ఉపాధి హామీ పథకంలో జరిగిన అవకతవకలపై విచారణ చేసి బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిందిగా పనిచేయని వారి పేర్లు కూడా మాస్టారోల్లో రాసి వారు డబ్బులు డ్రా చేసినట్టు పలువురు ఆరోపించారు. ఒకే కుటుంబంలో నలుగురు నుంచి ఐదుగురు పని చేసినట్టు పని చేయకుండా పేమెంటు తీసుకున్నట్టు ఆరోపిస్తున్న మాసాయిపేట గ్రామ ప్రజలు అలాగే పనిచేసిన వారితో వేలిముద్రలు (తంబు) పెట్టించి తక్కువ డబ్బులు ఇచ్చినట్టుగా బాధితురాలు నేటి గద్దర్ రిపోర్టర్ కు తెలియజేశారు.ఇప్పటికైనా తక్షణమే ఉపాధి హామీ పథకం సంబంధించిన అధికారులు అధికారులు స్పందించి విచారిస్తారో లేదో అని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు.