★మాదిగ జే.ఏ.సి.వ్యవస్థాపకులు యస్.సి.కార్పొరేషన్ మాజీ చైర్మన్ డా.పిడమర్తి రవి ద్వారానే మాదిగలకు 12% రిజర్వేషన్ సాధ్యం
★యస్.సి.వర్గీకరణ చేసి,మాదిగలకు జనాభా దమాషా ప్రకారం 12% రిజర్వేషన్ కల్పించి ఈ బడ్జెట్ సమావేశాలలోనే చట్ట బద్దత కల్పించాలని ముఖ్యమంత్రి కి వినతి
★మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర ప్రచార కార్యదర్శి:: సిద్దెల తిరుమల రావు
నేటి గదర్ న్యూస్, మణుగూరు రూరల్:
మణుగూరులోని పి.వి.కాలనిలో జరిగిన మాదిగ జే.ఏ.సి.ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాదిగ జే.ఏ.సి.రాష్ట్ర ప్రచార కార్యదర్శి సిద్దెల తిరుమల రావు ముఖ్య అధితిగా పాలుగోని ప్రసంగిస్తూ మాదిగ జే.ఏ.సి.వ్యవస్థాపకులు డా.పిడమర్తి రవి నాయకత్వంలో యస్.సి.వర్గీకరణలో మాదిగలకు 12%రిజర్వేషన్ సాధనే లక్ష్యంగా పిభ్రవరి 2న ఉస్మానియా యూనివర్సిటీలో జరుగు విద్యార్థి యువగర్జనను జయప్రదం చేయాలని కార్యకర్తలను కోరినారు.జనాభా దమాషా ప్రకారం,జిల్లాలను యూనిట్ తీసుకొని,యస్.సి.వర్గీకరణ చేయాలని ప్రభుత్వాన్ని కోరినారు.డా.పిడమర్తి రవి ద్వారానే మాదిగలకు 12% రిజర్వేషన్ సాధ్యం అని అన్నారు.పిభ్రవరి 2న జరుగు విద్యార్థి యువగర్జనకు అధిక సంఖ్య లో విద్యార్థులు,యువతీ,యువకులు పాలుగోని సభను జయప్రదం చేయాలని తెలిపినారు.ఈ సమావేశంలో. మాదిగ జేఏసీ మండల నాయకులు కన్నెగంటి వేణు రావులపల్లి వెంకటేశ్వర్లు డిసిసిబి డైరెక్టర్ బోయిల్ల రమణయ్య సింగరేణి ఉద్యోగుల సంఘం అధ్యక్షులు పంది గంగాధర్ మహారాజ్ మిద్దిపాక యాదగిరి ఇనుముల ప్రశాంత్ కండ ప్రశాంత తదితరులు పాలుగోన్నారు.