★పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు
భద్రాచలం
ఎమ్మెల్యేగా గెలిచి సంవత్సరం కాలంలోనే భద్రాచలం నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తున్న శాసనసభ్యులు తెల్లం వెంకట్రావు అభినందనీయుడని పవర్ బాయ్స్ నాయకులు వల్లపు ప్రేమ్ కుమార్ అన్నారు. శనివారం శాసనసభ్యులు తెల్లం వెంకటరావు జన్మదినాని పురస్కరించుకొని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పవర్ బాయ్స్ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రేమ్ కుమార్ మాట్లాడుతూ ప్రజా వైద్యుడిగా విద్యావంతుడిగా అత్యధిక మెజార్టీతో గెలిచిన వెంకట్రావు ఏజెన్సీ వ్యాప్తంగా నిరంతరం పర్యటిస్తూ సామాన్య ప్రజలకు పాలనను చేరువ చేశారని అన్నారు. ప్రత్యేకంగా యువజన రంగంపై దృష్టి సారించి యువతి యువకులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఎమ్మెల్యే వెంకట్రావు ఎనలేని కృషి చేస్తున్నారని అన్నారు. నియోజకవర్గ వ్యాప్తంగా వినాయక చవితి దసరా ఉత్సవాల సందర్భంగా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖను ఇతర శాఖలను అప్రమత్తం చేసి ఉత్సవాలను విజయవంతం చేసి యువకుల మనసులో శాశ్వత స్థానాన్ని ఎమ్మెల్యే పొందారని కొని ఆడారు. అనంతరం ఎమ్మెల్యేను శాలువా తో సత్కరించి పుష్పగుచ్చాలు ఇచ్చి కేకును కట్ చేసి మిఠాయిలు పంచారు. తనను అభినందించడానికి వచ్చిన యువకులతో ఎమ్మెల్యే మాట్లాడుతూ పట్టణంలోనే అత్యంత వైభవంగా వినాయక ఉత్సవాలు నిర్వహిస్తున్న ఘనత పవర్ బాయ్స్ కె దక్కుతుందని భవిష్యత్తులో ఈ కమిటీ మరింత ఐక్యతతో ఉత్సవాలతో పాటు సామాజిక సేవ కార్యక్రమాలు నిర్వహించాలని కోరారు. నేటి రాజకీయాలకు యువతే కీలకమని దేశ సమగ్రతను కాపాడేందుకు యువకులు రాజకీయాలలోకి రావాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే వెంకట్రావు కోరారు. ఈ కార్యక్రమంలో పవర్ బాయ్స్ సభ్యులు సందీప్ శతకీర్తి సతీష్ సంతోష్ సాయి వర్మ రేవంత్ తదితరులు పాల్గొన్నారు