ఈ నెల 26 న ప్రారంభం కానున్న నాలుగు పథకాలకు సంబంధించి తొలి రోజు ఒక గ్రామానికి మాత్రమే కాంగ్రెస్ ప్రభుత్వ పథకాలు అందజేస్తామని. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క తెలిపారు. ఈ మేరకు ఆయన డిప్యూటీ సీఎం కార్యాలయంలో వివరాలు వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఆ నాలుగు పథకాలు రిపబ్లిక్ డే రోజున అమలు చేస్తామని గత కొన్ని నెలలుగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో రాష్ట్రంలోని
మండలానికి ఒక గ్రామానికి మాత్రమే తొలుత రైతు భరోసా, రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు పూర్తి స్థాయిలో అందిస్తాం అని తెలిపారు. అర్హులైన ప్రతి ఒక్కరికి తప్పక పథకాలు అందుతాయని ఎవరు ధైర్య పడాల్సిన పనిలేదని డిప్యూటీ సీఎం తెలిపారు.
Post Views: 312