మంగపేట మండల కేంద్రంలో,భారతీయ జనతా పార్టీ మండల అధ్యక్షులు, రావుల జానకి రావు ఆధ్వర్యంలో, సంవిధాన్ గౌరవ్ అభియాన్ కార్యక్రమంలో భాగంగా, మంగపేట హైస్కూల్ విద్యార్థు లను కలవడం జరిగింది, ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి, అధ్యక్షులు మాట్లాడుతూ, భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ , మన భారతదేశానికి లభించడం గొప్ప ఆస్తి అని, వారి ద్వారానే భారతదేశానికి గొప్ప ప్రజాస్వామ్యాన్ని అందించారని, భారతదేశంలో ని ప్రతి పౌరుడికి మన రాజ్యాంగం యొక్క గొప్పతనం తెలియాలని, దళిత బడుగు బలహీన వర్గాలకు, అంబేద్కర్ ఎంతో కృషి చేశారని, 1950 జనవరి 26న భారత రాజ్యాంగాన్ని అమలు పరిచిన తర్వాత స్వతంత్ర భారతదేశం ప్రజాస్వామ్య, సర్వ సత్తాక స్వతంత్ర గణతంత్ర రాజ్యాంగ దేశం గా అవతరించిందని ప్రతి సంవత్సరం జనవరి 26 న గణతంత్ర దినోత్సవంగా జరుపుకుంటారని ఆయన విద్యార్థులకు వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా అధ్యక్షులు, లోడే,శ్రీనివాస్ సీనియర్ నాయకులు,రామిడి సురేష్ , కార్యదర్శులు, నిడదవోలు శ్రీనివాస్, సాంబయ్య,కిసాన్ మోర్చా మండల అధ్యక్షులు, మూతి రవి, బూత్ అధ్యక్షులు, మధు, రాజు, కార్యకర్తలు, తదితరులు పాల్గొన్నారు.
