నేటి గదర్ న్యూస్ ప్రతినిధి మంగపేట.
జాతీయ ఓటరు దినోత్సవం సందర్భంగా మంగపేట మండల కేంద్రంలో జడ్పీహెచ్ఎస్ పాఠశాల నుండి తెలంగాణ సెంటర్ వరకు ర్యాలీ నిర్వహించడం జరిగింది. తదనంతరం మంగపేట మండల తహసిల్దార్ జాతీయ ఓటర్ల దినోత్సవం ప్రాముఖ్యతను వివరించారు, 18 సంవత్సరాలు నిండిన యువతీ యువకులు ప్రతి ఒక్కరు ఓటు నమోదు చేసుకోవాలని, ఓటు హక్కు కలిగి ఉన్న ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కును సక్రమంగా వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో భాగంగా సీనియర్ సిటిజన్ ఓటర్లను సన్మానించారు.వ్యాసరచన పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థిని విద్యార్థులకు సర్టిఫికెట్లు అందించారు. ఉత్తమ బిఎల్ఓ లకి ప్రశంస పత్రాలు అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో మండల తహసిల్దార్ శ్రీ టి రవీందర్ మండల విద్యా శాఖ అధికారిణి శ్రీమతి పొదెం మేనక , రెవెన్యూ కార్యాలయ సిబ్బంది, బూత్ లెవెల్ అధికారులు, పాఠశాల సిబ్బంది, విద్యార్థిని విద్యార్థులు, మంగపేట మండల ప్రజలు పాల్గొన్నారు.
