రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 25:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని శ్రీ చిత్తారమ్మ జాతర ఉత్సవాలు అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి.ఈనెల 24 శుక్రవారం ప్రారంభమైన జాతర ఉత్సవాలలో భాగంగా శనివారం నాడు స్థానిక సగర సంఘం ఆధ్వర్యంలో నిత్య పూజలు,చండి హోమం, సాయంత్రం పల్లకి సేవ,నిత్య బలి హరణములు,తీర్థ ప్రసాద వితరణ,ఆశీర్వచనము కార్యక్రమాలు నిర్వహించడం జరిగింది.ఈ జాతర సందర్భంగా ఎ లాంటి ఇబ్బందులు తలెత్తకుండా సంఘం ఆధ్వర్యంలో అన్ని చర్యలు, జాగ్రత్తలు తీసుకోవడం జరిగింది.ఈ కార్యక్రమాల్లో మహిళలు భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు.
Post Views: 56