◆సమాజంలో మీడియా పాత్ర చాలా కీలకమైనది.
◆వైరా సిపిఎం టౌన్ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు.
నేటి గదర్ న్యూస్ జనవరి 26: వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాస రావు
వైరా :నేటి గదర్ తెలుగు దిన పత్రిక క్యాలెండర్ ను వైరా సిపిఎం టౌన్ కార్యదర్శి చింత నిప్పు చలపతిరావు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారధిగా ఉంటూ,సమాజంలో మంచి జరగాలన్న శాంతిభద్రతలు పరిరక్షించడంలో మీడియా పాత్ర కీలకంగా ఉంటుంది అని మంచి కథనాలు ప్రచురిస్తూ పత్రికా రంగంలో ప్రజలకు ఒక దిక్సూచి లా అనతి కాలంలోనే మీడియా రంగంలో తనకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుంది. సమాజంలో జరుగుతున్న అన్యాయాలను అక్రమాలను, విద్రోహక శక్తులను వెలికి తీసి ప్రజాస్వామ్యాన్ని కాపాడటంలో మీడియా పాత్ర చాలా కీలకమైనది వెలకట్టలేనిది అన్నారు. మారుమూల గ్రామంలో జరిగిన వార్తలను సంఘటనలు ప్రపంచానికి తెలియజేసే టీవీ చానల్స్ పేపర్లును ప్రజలు ఎప్పటికీ మర్చిపోరు చిరస్థాయిగా నిలిచిపోతాయని అన్నారు. వార్తల సేకరణలో ముందున్న నేటి గదర్ దినపత్రిక వైరా నియోజకవర్గ ప్రతినిధి శ్రీనివాసరావు ని అభినందించారు. ఈ కార్యక్రమంలో పైడిపల్లి సాంబశివరావు( టౌన్ కమిటీ సభ్యులు) sk.నాగుల్ పాషా, sk.ఖాజా, గుడిమెట్ల మోహన్ రావు, రాచ బంటి, అమరనేని కృష్ణ, పారుపల్లి చంద్రశేఖర్, మాడపాటి మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు.