రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 26:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో 76వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా పట్టణంలోని గాంధీ విగ్రహం దగ్గర మున్సిపల్ వైస్ చైర్మన్ పుట్టి విజయలక్ష్మి,సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయం వద్ద సిఐ.వెంకట రాజాగౌడ్,పోలీస్ స్టేషన్ వద్ద ఎస్సై బాలరాజ్, మున్సిపల్ కార్యాలయం వద్ద మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్ గౌడ్,ఎంపీడీవో కార్యాలయం వద్ద ఎంపీడీవో సాజినోద్దీన్, ఎంఈఓ కార్యాలయం వద్ద ఎంఈఓ శ్రీనివాస్ వ్యవసాయ అధికారి కార్యాలయం వద్ద రాజ్ నారాయణ,రైతు వేదిక వద్ద ప్రవీణ్,పిఎసిఎస్ కార్యాలయం వద్ద బాధే చంద్రం మండల తహసిల్దార్ కార్యాలయం వద్ద తహసిల్దార్ రజనీకుమారి,అటవీ శాఖ కార్యాలయం వద్ద రేంజ్ అధికారి విద్యాసాగర్,ఐసిడిఎస్ కార్యాలయం వద్ద స్వరూప రాణి,ఎస్టిఓ కార్యాలయం వద్ద నాగరాణి,పలు ప్రభుత్వ కార్యాలయాల వద్ద అధికారులు,ప్రభుత్వ ప్రైవేటు కళాశాల,పాఠశాల వద్ద ప్రధానోపాధ్యాయులు,ప్రిన్సిపాళ్లు పట్టణంలోని కాంగ్రెస్,బిఆర్ఎస్, బిజెపి పార్టీల కార్యాలయాల వద్ద నాయకులు జాతీయ జెండాలను ఎగరవేశారు.అనంతరం రామాయంపేట మండల ప్రజలకు గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు వారు తెలియపరచారు.
