రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 26:- మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలో స్థానిక సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయంలో సీఐ.వెంకట రాజాగౌడ్ చేతుల మీదుగా నేటి గదర్ న్యూస్ క్యాలెండర్ ను ఆవిష్కరించడం జరిగింది.ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ సమాజంలో పత్రికలు ప్రజల సమాచారాన్ని అందించడంలో ముఖ్యపాత్ర వహిస్తున్నాయని తెలిపారు.అందులో భాగంగా నేటి గదర్ న్యూస్ ఎప్పటికప్పుడు ప్రజలకు సమాచారం అందించడంలో సమాజంలో ముందుంటూ ఎల్లప్పుడూ ప్రజల పక్షాన ఉండి మరింత ముందుకు వెళ్లాలని కోరుతున్నట్లు అయన తెలిపారు.ఈ కార్యక్రమంలో పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
Post Views: 69