తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్ల దరఖాస్తులను మరోసారి పరిశీలించి లబ్ధిదారులను ఎంపిక చేయాలని అధికారులను హౌసింగ్ కార్పొరేషన్ ఆదేశించింది. జాబితాలో అనర్హుల పేర్లను తొలగించాలని సూచించింది. దరఖాస్తులను 3 కేటగిరీలుగా (L1, L2, L3) విభజించింది. L1లోకి సొంత స్థలం ఉండి ఇళ్లు లేని వాళ్లు, L2లోకి స్థలం, ఇళ్లు రెండూ లేని వాళ్లు, L3లోకి అద్దె/రేకులు/పెంకుటిళ్లలో ఉన్నవారు వస్తారు. తొలి దశలో L1 కేటగిరీ వారికి ఇళ్లు మంజూరు చేస్తారని సమాచారం.
Post Views: 49