వల్లూరు అటవీ ప్రాంతంలో చిరుత పులికి దహన సంస్కారాలు
రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 31:- మెదక్ జిల్లా నార్సింగి మండలం వల్లూరు గ్రామ 44వ జాతీయ రహదారిపై గత రాత్రి రోడ్డు దాటడానికి ప్రయత్నిస్తున్న చిరుత పులిని గుర్తుతెలియని వాహనం డీ కొట్టడంతో రోడ్డు ప్రమాదంలో చిరుత పులి మృతి చెందింది.ఈ మృతి చెందిన చిరుత పులికి దహన కార్యక్రమాన్ని నార్సింగి మండలం వల్లూరు అటవీ ప్రాంతంలో శుక్రవారం రోజు నిర్వహించారు.మెదక్ జిల్లా డీఎఫ్ఓ జోజి,రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్,నార్సింగి ఎస్సై మోహినోద్దీన్ సమక్షంలో వెటర్నరీ వైద్య బృందం పోస్టుమార్టం నిర్వహించి దహన సంస్కారాలు చేశారు.ఈ సందర్భంగా జిల్లా డిఎఫ్ఓ జోజి మాట్లాడుతూ అటవీ ప్రాంతంలో అండర్ పాసులు నిర్మించాలని జాతీయ రహదారి అధికారులకు ఉత్తరాలు వ్రాస్తున్నట్లు డిఎఫ్ఓ జోజి తెలిపారు.అదేవిధంగా అటవీ ప్రాంతంలో జంతు సంచార సంబంధించి ఫోటోలు పెట్టాలని కోరుతున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమంలో రామాయంపేట రేంజ్ ఆఫీసర్ విద్యాసాగర్,నార్సింగి ఎస్సై మోహినోద్దీన్ ఫారెస్ట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.