రామాయంపేట (నేటి గద్దర్ ప్రతినిధి) జనవరి 31:- మెదక్ జిల్లా నిజాంపేట మండల కేంద్రంగా నూతన బస్టాండ్ ఆవరణలో ప్రజా యుద్ధ నౌక గద్దర్ అలియాస్ గుమ్మడి విఠల్ గారి 77వ జయంతి ఉత్సవాలను పార్టీలకతీతంగా ప్రజా సంఘాలు, దళిత బహుజన ఫ్రంట్ ఆధ్వర్యంలో జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించడం జరిగింది.ఈ సందర్భంగా సంజీవ్ మాట్లాడుతూ ప్రజా గాయకుడు గద్దర్ విప్లవ జీవితంలో పీడిత ప్రజల కోసం అనేక ఆటుపోట్లు ఎదుర్కొని పేద ప్రజల అభ్యున్నతి కోసం అనేక పోరాటాలు చేసి పాటలు రాసి కవి,వాగ్గేయకారుడని అన్నారు.పీడిత ప్రజల తరపున అలుపెరుగని పోరాటం చేసిన ఉద్యమ వీరుడు సమ సమాజ నిర్మాణమే ధ్యేయంగా తెలంగాణ తొలి,మలిదశ ఉద్యమంలో ప్రజలను చైతన్యవంతం చేసి,దొరల పాలన అంతం చేయడంలో తన కాళ్లకు గజ్జలు కట్టి ఆట-పాట ద్వారా ప్రశ్నించే గొంతుకై నిలిచి,ప్రజా పాలనను తీసుకురావడంలో తను వంతు కృషి చేసిన గొప్ప మహానీయుడని అన్నారు.ఆయనపై బిజెపి కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ గద్దర్ కు అవార్డులు రివార్డులు ప్రభుత్వాలు ఇచ్చే అవార్డులు అవసరం లేదనడం ఎంతవరకు సమంజసమన్నారు. గద్దర్ కు ప్రజలే ఒక పెద్ద అవార్డులుగా ఆనాడే అయన కోరుకున్నాడని ప్రజలే ఆయన 40 సంవత్సరాల జీవిత చరిత్రలో పంచశీల రాజ్యాంగాన్ని పట్టుకొని రాజ్యాంగాన్ని పరిరక్షించుకుందాం, రాజ్యాంగాన్ని కాపాడుకుందాం అనే అంశంతో ప్రజలను ఏకం చేసిన గొప్ప మహనీయుడని అన్నారు.ఈ కార్యక్రమంలో కొమ్మాట బాబు, గరుగుల శ్రీనివాస్, మారుతి, నసీరుద్దీన్,రవీందర్,కొమ్మాట అమర్,బ్యాగరి రాజు,మోహన్ రెడ్డి,శ్యామల మహేష్,కొమ్మాట స్వామి,వల్లపు స్వామి, తదితరులు పాల్గొన్నారు.
